Minister KTR : సంచులు మోసేటోడు రేవంత్ రెడ్డి
ఢిల్లీ బానిసలకు ఆత్మ గౌరవానికి పోటీ
Minister KTR : రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి నిప్పులు చెరిగారు. నిజామాబాద్ లో జరిగిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలను ఏకి పారేశారు. సదరు పార్టీల నేతలకు చేవ లేదన్నారు. వారంతా కట్టు బానిసలుగా పడి ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఏ పని కావాలన్నా, ఏం మాట్లాడాలన్నా వారికి స్వేచ్ఛ లేదన్నారు.
Minister KTR Comments
వీళ్ల వల్ల తెలంగాణకు ఒరిగేది ఏమీ ఉండదన్నారు. రాబోయే శాసన సభ ఎన్నికల్లో ఢిల్లీ బానిస నేతలకు , తెలంగాణ ఆత్మ గౌరవానికి మధ్య పోటీ ఉంటుందన్నారు కేటీఆర్. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలని అన్నారు. ఆగం కావద్దని సూచించారు. ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
దేశ రాజకీయాలలో అద్భుతమైన పాలనా దక్షత కలిగిన ఏకైక నాయకుడు ఒకే ఒక్కడు తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) అని స్పష్టం చేశారు కేటీఆర్. రాదని అనుకున్న తెలంగాణను ఆచరణలో తీసుకు వచ్చిన దార్శనికుడు మన నాయకుడు అని పేర్కొన్నారు. దద్దమ్మలు ఎన్నో మాట్లాడతారని, వారికి అంత సీన్ లేదన్నారు మంత్రి. సంచులు మోస్తూ అడ్డంగా దొరికిన ఓటుకు నోటు దొంగ, థర్డ్ రేట్ క్రిమినల్ , చిప్ప కూడు తిన్న రేవంత్ రెడ్డి వీళ్లలో ఎవరు కావాలో ఆలోచన చేయాలని అన్నారు కేటీఆర్.
Also Read : Chandrababu Naidu : నన్ను చంపాలని చూశారు – చంద్రబాబు
