MK Stalin : భారత హాకీ జట్టు జైత్ర యాత్ర కొనసాగించింది. చెన్నై వేదికగా జరిగిన ఆసియా కప్ హాకీ చాంపియన్ షిప్ ట్రోఫీని వరుసగా నాలుగోసారి కైవసం చేసుకుంది. ప్రత్యర్థి మలేసియా జట్టును ఫైనల్ లో 4-3 తేడాతో ఓడించింది.
అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి టీమిండియా. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ సారథ్యంలో జట్టు కలిసికట్టుగా ఆడింది. తమకు ఎదురే లేదని చాటింది. ఈ సందర్భంగా టోర్నీలో ఆద్యంతమూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ విజేతగా నిలిచినందుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) ప్రశంసలతో ముంచెత్తారు.
MK Stalin Appreciated Champions
భారత జట్టుకు ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీని అందజేశారు. ఆయనతో పాటు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. భారత జట్టు సాధించిన ఈ గెలుపు భారతీయ యువతకు స్పూర్తి దాయకంగా నిలుస్తుందన్నారు.
అచంచలమైన నమ్మకం, పట్టుదల, కృషి ఉంటే ఎంతటి కష్టమైనా ఎదుర్కొని దాట వచ్చని నిరూపించారంటూ హాకీ జట్టును ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా కెప్టెన్ కు, సభ్యులకు కంగ్రాట్స్ తెలిపారు. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన భారత జట్టుకు భారీ నజరానా ప్రకటించారు. ఒక్కో ఆటగాడికి రూ. 5 లక్షలు బహుమతిగా ఇస్తున్నట్లు వెల్లడించారు.
Also Read : Asian Champions Trophy : ఆసియా హాకీ చాంపియన్స్ మనదే
