BRS MLAs Comment : ఎమ్మెల్యేలు గులాబీ ముళ్లు

నోరు తెరిస్తే అన్నీ బూతులే

BRS MLAs Comment : నాయ‌కుడిని బ‌ట్టే నేత‌లు ఉంటార‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ తెలంగాణ‌లో మాత్రం అందుకు భిన్నంగా సాగుతోంది. గ‌త కొంత కాలంగా భార‌త రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) చీఫ్ కేసీఆర్ మాట్లాడుతున్న భాషపై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర అభ్యంత‌రం తెలిపాయి. కానీ ఆయా పార్టీల‌కు చెందిన నాయ‌కులు ఎవ‌రూ సీఎంను ఎదిరించే సాహ‌సం చేయ‌లేక పోతున్నారు.

త్వ‌ర‌లో తెలంగాణ‌లో శాస‌న స‌భ ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఇప్ప‌టికే కేసీఆర్ ఆయా సీట్ల‌కు సంబంధించి 115 మంది అభ్య‌ర్థుల జాబితాను వెల్ల‌డించారు. ఎన్నిక‌ల శంఖారావానికి శ్రీ‌కారం చుట్టారు. ఇదంతా ప‌క్కన పెడితే బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు అనుస‌రిస్తున్న ప‌ద్ద‌తులు త‌ల దించుకునేలా ఉన్నాయి.

BRS MLAs Comment Viral

వారు మాట్లాడుతున్న భాష అత్యంత జుగుస్సాక‌రంగా, హేయ్య‌మైన‌విగా ఉంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్(BRS) ప్రజా ప్ర‌తినిధుల నిర్వాకం త‌ల‌వంపులు తెచ్చేలా ఉన్నాయి. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ఎమ్మెల్యేల‌ను కుక్క‌ల‌తో పోల్చిన ఘ‌న‌త ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డికి ద‌క్కుతుంది. ఈయ‌న ఎవ‌రో కాదు విద్యా సంస్థ‌ల‌ను స్థాపించాడు.

ఇక ఒకప్పుడు సేల్స్ మెన్ గా , కూలీ ప‌ని నుంచి బ‌ట్ట‌ల వ్యాపారం చేసుకుంటూ రూ. 3,000 కోట్ల ట‌ర్నోవ‌ర్ కు చేరుకున్నారు చెన్నై షాపింగ్ మాల్ చీఫ్ , నాగ‌ర్ క‌ర్నూల్ ఎమ్మెల్యే మ‌ర్రి జ‌నార్ద‌న్ రెడ్డి. ఆయ‌న ఎమ్మెల్యేన‌న్న సంగ‌తి మ‌రిచి పోయారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ల‌ను తాను సైగ చేస్తే త‌ట్టు కోలేర‌న్నారు. ఆపై నోరు జారారు. ఏకంగా త‌న‌కు కోపం వ‌స్తే కాల్చి పారేస్తానంటూ హెచ్చ‌రించారు.

ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత రావు తిరుమ‌ల పుణ్య క్షేత్రం సాక్షిగా రాజ‌కీయాలు మాట్లాడ కూడ‌ద‌న్న రూల్ ను పాటించ లేదు. అక్క‌డి నుంచే మంత్రి హ‌రీశ్ రావుపై భ‌గ్గుమ‌న్నారు. ఒక‌నాడు ర‌బ్బ‌రు చెప్పుల‌తో వ‌చ్చిన నీకు ల‌క్ష కోట్లు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో చెప్పాల‌న్నారు.

ఇదే పార్టీకి చెందిన మంత్రుల‌పై స‌వాల‌క్ష ఆరోప‌ణ‌లు ఉన్నాయి. లెక్క‌లేన‌న్ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. బీఆర్ఎస్(BRS) కు చెందిన ఓ మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధి త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాన‌సికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నారంటూ బ‌హిరంగంగానే వాపోయింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూ క‌బ్జాకు పాల్ప‌డ్డారంటూ స్వంత కూతురే బ‌య‌ట‌కు వ‌చ్చి చెప్పింది. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది చ‌రిత్ర‌.

ఒక బాధ్య‌త క‌లిగిన సీఎం ప‌ద‌విలో ఉన్న కేసీఆర్ ఇలాంటి వాళ్ల‌ను ప్రోత్స‌హిస్తూ పోతే రేపు ఎలా పార్టీ ప‌ట్ల‌, ప్ర‌జా ప్ర‌తినిధుల ప‌ట్ల గౌర‌వంగా ఉంటారో ఆలోచించు కోవాలి. రేపొద్దున జ‌నానికి ఏం జ‌వాబు చెబుతావో చూడాలి.

నిన్న‌టి దాకా త‌మ‌కు ఎదురే లేద‌ని విర్ర‌వీగుతూ వ‌చ్చిన కాషాయ శ్రేణుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు క‌న్న‌డ ప్ర‌జ‌లు. ఇక‌నైనా జర జాగ్ర‌త్త‌తో పార్టీ శ్రేణుల‌ను కంట్రోల్ లో ఉంచు కోగ‌లుగుతే బెట‌ర్. లేక పోతే
అధికారంలో ఉన్నా ప‌వ‌ర్ ను ఎంజాయ్ చేస్తున్నా ప్ర‌జ‌ల నుంచి ఆశించిన మేర గౌర‌వాన్ని మాత్రం పొంద లేర‌ని గుర్తుంచు కోవాలి.

Also Read : MP Sanjay Singh : అదానీ ఆత్మ బంధువు మోదీ

Leave A Reply

Your Email Id will not be published!