Bethi Subhash Reddy : సీఎం నిర్ణ‌యం ఎమ్మెల్యే ఆగ్ర‌హం

చెప్పేందుకు నాకు ఛాన్స్ ఇవ్వ‌రా

Bethi Subhash Reddy : బీఆర్ఎస్ లో టికెట్ల కేటాయింపు తీవ్ర అసంతృప్తిని రాజేసింది. ఇప్ప‌టికే న‌కిరేక‌ల్ లో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం చివ‌రి దాకా నిరీక్షించారు. ప్ర‌క‌టించిన జాబితాలో త‌న పేరు లేక పోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అని ఆరోపించారు.

Bethi Subhash Reddy Shocking Comments

ఇక మ‌ల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత రావు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మంత్రి హ‌రీశ్ రావును టార్గెట్ చేశారు. చివ‌ర‌కు పార్టీని వీడాల‌ని అనుకున్నారు. ఒక‌నాడు ర‌బ్బ‌ర్ స్లిప్ప‌ర్ల‌తో ఉన్న త‌న్నీరు హ‌రీశ్ రావు ఇవాళ ల‌క్ష కోట్ల ఆస్తుల‌ను ఎలా సంపాదించాడో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

తాజాగా వీరి జాబితాలోకి మ‌రొక‌రు చేరారు. ఆయ‌న ఎవ‌రోకాదు హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి(Bethi Subhash Reddy). తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై. త‌న‌పై ఎలాంటి అవినీతి, ఆరోప‌ణ‌లు అన్న‌వి లేనే లేవ‌న్నారు. త‌న‌కు టికెట్ ఎందుకు ఇవ్వ లేదో చెప్పాల‌న్నారు.

సీఎం కేసీఆర్ పిలుస్తార‌ని అనుకున్నాని ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లికిన దాఖ‌లాలు లేవ‌న్నారు. పార్టీ కోసం ల‌క్ష్మా రెడ్డి ఏం చేశారో తండ్రీ కొడుకులు కేసీఆర్, కేటీఆర్ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మేక‌ను బ‌లి ఇచ్చే ముందు నీళ్లు పోస్తార‌ని, ఉరి వేసే ముందు ఆఖ‌రి కోరిక అడుగుతార‌ని కానీ నాకు ఆ అవ‌కాశం కూడా లేదా అని వాపోయారు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి.

Also Read : VVS Laxman : ఇండియా హెడ్ కోచ్ గా లక్ష్మ‌ణ్

Leave A Reply

Your Email Id will not be published!