PM Modi Slams : న్యూఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి తెలంగాణపై విషం కక్కారు. మరోసారి తెలంగాణపై నోరు పారేసుకున్నారు. గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఏపీ విభజన సరిగా జరగలేదని ఆరోపించారు. దీని వల్ల ఏపీకి నష్టం జరిగిందని అర్థం వచ్చేలా ఆరోపించారు నరేంద్ర మోదీ.
తాజాగా న్యూఢిల్లీలో సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆ వెంటనే ఏపీ విభజన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రధానమంత్రి. ఈ సమావేశంలో ఆనాటి ప్రభుత్వంలో కొలువు తీరిన వారంతా ఉన్నారు.
PM Modi Slams & Telangana CM KCR
సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఉద్దేశించి మోదీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పదే పదే తెలంగాణ గురించి మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు బీఆర్ఎస్ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంపై మోదీ విషం కక్కడాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ ఎంపీలు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీ నిర్వాకంపై. ఏపీ విభజన పూర్తయిందని, రెండు రాష్ట్రాలలో పాలన కొనసాగుతోందని ఈ తరుణంలో మోదీ మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
Also Read : PM Modi : కుల వృత్తులకు చేయూత
