PM Modi : కుల వృత్తుల‌కు చేయూత‌

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ

PM Modi : న్యూఢిల్లీ – కుల వృత్తుల‌కు కేంద్ర స‌ర్కార్ చేయూత ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా స‌రే కోట్లాది రూపాయ‌ల నిధుల‌ను మంజూరు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. విశ్వ క‌ర్మ జ‌యంతి సంద‌ర్బంగా ఇది కుల వృత్తుల‌ను న‌మ్ముకున్న వారికి ఈ స్కీం ఆస‌రా ఇస్తుంద‌న్నారు మోదీ.

PM Modi Good News t Atrisans

గ‌తంలో దేశాన్ని ఏలిన పాల‌కులు పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాలు, వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi). అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన స‌మ‌యంలో తాను పీఎంగా కొలువు తీరాన‌ని ఇవాళ దేశాన్ని అభివృద్ది ప‌థంలో ప‌య‌నించేలా చేశాన‌ని చెప్పారు.

శ్ర‌మించే వారికి ఎల్ల‌ప్ప‌టికీ ఇబ్బందులు అంటూ ఉండ‌వ‌న్నారు న‌రేంద్ర మోదీ. ప్ర‌పంచం యావ‌త్తు భార‌త దేశం వైపు చూస్తోంద‌న్నారు. ఇవాళ జి20కి సైతం మ‌నం నాయ‌క‌త్వం వ‌హించ‌డం అద్భుత‌మ‌న్నారు. రాబోయే రోజుల్లో భార‌త్ మున్ముందుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌న్నారు ప్ర‌ధాన మంత్రి.

అందుకే అన్ని వ‌ర్గాల వారు త‌మ‌ను ఆశీర్వ‌దిస్తున్నార‌ని చెప్పారు. త‌మ‌ను అడ్డుకునే సత్తా ప్ర‌తిప‌క్షాల‌కు లేద‌ని ఎద్దేవా చేశారు న‌రేంద్ర మోదీ. కుల వృత్తుదారుల‌కు పీఎం భ‌రోసా ఇచ్చారు.

Also Read : Minister KTR : మోసం కాంగ్రెస్ నైజం – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!