Minister KTR : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. మోసానికి కాంగ్రెస్ చిరునామా అని ఎద్దేవా చేశారు. వంచన, ద్రోహానికి పెట్టింది పేరు అంటూ పేర్కొన్నారు. కపట కథలు, కంత్రీ గోత్రాలకు కాంగ్రెస్ లో తక్కువ లేదంటూ మండిపడ్డారు.
Minister KTR Comments on Congress
కల్లబొల్లి గ్యారెంటీలు తెలంగాణలో చెల్లుబాటు కావన్నారు. రాబందుల రాజ్యం వస్తే రైతు బంధు రద్దవడం ఖాయమని జోష్యం చెప్పారు. కాలకేయుల కాలం వస్తే కరెంట్ కోతలు, కటిక చీకట్లు వస్తాయంటూ హెచ్చరించారు కేటీఆర్.
మూడు రంగుల ఊసర వెల్లిని నమ్ముకుంటే మూడు గంటల కరెంటే గతి అని, ఉచిత విద్యుత్ ఊడ గొట్టడం పక్కా అని పేర్కొన్నారు. దగా కోరుల పాలన వస్తే ధరణి రక్షణ ఎగిరి పోవడం గ్యారెంటీ అని స్పష్టం చేశారు.
బకాసురులు అధికారంలోకి వస్తే రైతు బీమా..ధీమా గల్లంతు అవుతుందని హెచ్చరించారు కేటీఆర్(Minister KTR). సమర్థత లేని సన్నాసులకు ఓటేస్తే సకల రంగాల్లో సంక్షోభం రాక తప్పదన్నారు. దొంగల చేతికి తాళాలు ఇస్తే సంపదనంతా స్వాహా చేస్తారంటూ ఆరోపించారు కేటీఆర్.
స్కాముల పార్టీకి స్వాగతం చెబితే స్కీములన్నీ ఎత్తేస్తారంటూ పేర్కొన్నారు. కర్షకుల కష్టం తెలియనోళ్లు కాకమ్మ కబుర్లు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు మంత్రి.
Also Read : Mithali Raj : సిరాజ్ సూపర్ – మిథాలీ రాజ్
