TDP Tribute NTR : గుంటూరు – ఏపీ అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకుని వెంకట పాలెం లోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం శాసన సభా పక్షం నివాళులర్పించింది. చంద్రబాబు అరెస్టు అక్రమమని గళమెత్తటమే ప్రధాన అజెండాగా చట్ట సభలకు వెళ్తున్నామని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు.
TDP Tribute NTR in Venkatapalem
చేసిన తప్పునకు ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు(Chandrababu) అక్రమ అరెస్టుపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాకే.. మరే అంశమైనా తీసుకోవాలన్నారు. సచివాలయం సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నేతలు నిరసన చేపట్టారు.
తెలుగుదేశం శాసన సభ పక్షం నిరసనలో వైకాపా బహిష్కృత ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ‘చంద్రబాబుపై కక్ష – యువత భవితకు శిక్ష’ అంటూ ఎమ్మెల్యేలు ప్లకార్డుల ప్రదర్శించారు.
చంద్రబాబుపై అక్రమ కేసు ఎత్తేసి వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్రగా వెళ్లారు.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.89 కోట్లు
