Manavatha Roy : కాంగ్రెస్ మోసం రాయ్ ఆగ్ర‌హం

ఉద్య‌మ వీరుల‌కు టికెట్లు ఇవ్వ‌క పోతే ఎలా

Manavatha Roy : హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మాన‌వ‌తా రాయ్ స్వంత పార్టీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న జీవితంలో స‌గ భాగం కాంగ్రెస్ పార్టీ కోసం ప‌ని చేశాన‌ని , ఎందుకు త‌న‌కు టికెట్ ఇవ్వ‌డం లేదో చెప్పాల‌ని నిల‌దీశారు. కేవ‌లం అగ్ర వ‌ర్గాల‌కు చెందిన వారికి ఎలా టికెట్లు ఇస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ నినాదం అని మండిప‌డ్డారు.

Manavatha Roy Serious on Congress

తాను విద్యార్థి నాయ‌కుడిగా ఉద్య‌మాలు చేశాన‌ని, తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించాన‌ని, ప్ర‌జ‌ల గొంతుక‌ను వినిపించాన‌ని, 20 ఏళ్ల‌కు పైగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై కొట్లాడిన త‌న‌ను ఇలా ప‌క్క‌న పెడితే ఎలా అని ధ్వ‌జ‌మెత్తారు మాన‌వ‌తా రాయ్(Manavatha Roy). ఇదేనా ప్ర‌జాస్వామ్యం అంటే అని భ‌గ్గుమ‌న్నారు.

మాతో పాటు ఉద్య‌మాలు చేసిన తన స‌హ‌చ‌రుల‌కు భార‌తీయ రాష్ట్ర స‌మితి పార్టీ ఎమ్మెల్యే టికెట్ల‌ను ఇచ్చింద‌న్నారు. అంతే కాదు 20కి పైగా కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టింద‌ని ఇంత‌కంటే స‌మ న్యాయం ఎక్క‌డుంద‌న్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఒకే కులానికి చెందిన వారిదే ఆధిప‌త్యం కొన‌సాగుతున్నా పార్టీ హై క‌మాండ్ ప‌ట్టించుకోక పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఇలాగే ఉంటే పార్టీ నుండి కీల‌క‌మైన వ్య‌క్తులు దూర‌మ‌య్యే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్నారు మాన‌వ‌తా రాయ్.

Also Read : Minister KTR : రేవంత్ రెడ్డి కిష‌న్ రెడ్డికి ఏజెంట్

Leave A Reply

Your Email Id will not be published!