G Kishan Reddy : తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి
G Kishan Reddy : హైదరాబాద్ – కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంపై కిషన్ రెడ్డి(G Kishan Reddy ) స్పందించారు.
తెలంగాణ రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాక తప్పదన్నారు. టాప్ ప్లేస్ భారతీయ జనతా పార్టీ ఉంటుందని జోష్యం చెప్పారు. ఇక మిగతా పార్టీలైన కాంగ్రెస్ , బీఆర్ఎస్ కేవలం 2వ స్థానం కోసం పోటీ పడతాయని స్పష్టం చేశారు.
G Kishan Reddy Comment
ఆయా పార్టీలు రెండవ స్థానం కోసం పోటీ పడక తప్పదన్నారు. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. తెలంగాణ గడ్డ పై కాషాయం రెప రెప లాడడం తప్పదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పోటీ చేసేందుకు దరఖాస్తులు వచ్చాయని చెప్పారు జి. కిషన్ రెడ్డి.
ఇదిలా ఉండగా మూడు దశలలో అభ్యర్థులు ఎవరనేది ప్రకటిస్తామని చెప్పారు. పూర్తిగా స్క్రీనింగ్ చేశాకనే వెల్లడిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, నాలుగున్నర కోట్ల ప్రజానీకం మొత్తం బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నారని జోష్యం చెప్పారు.
Also Read : Uttam Kumar Reddy : దళిత బంధుపై ఈసీకి ఫిర్యాదు
