Jupally Krishna Rao : జూప‌ల్లికే కాంగ్రెస్ జై

పంతం నెగ్గించుకున్న కృష్ణారావు

Jupally Krishna Rao : హైద‌రాబాద్ – తెలంగాణ ఉద్య‌మ కాలంలో కీల‌క పాత్ర పోషించిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన జూప‌ల్లి కృష్ణారావు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ప‌ని చేశారు. విద్యుత్ స‌మ‌స్య విష‌యంలో జైలుకు వెళ్లారు.

Jupally Krishna Rao Contest from Kollapur

ఆ త‌ర్వాత సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రిగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. సుదీర్ఘ మంత‌నాల అనంత‌రం బీజేపీ వైపు వెళ‌తార‌ని అనుకున్నారు.

అక్క‌డ త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థిగా భావించే డీకే అరుణ కీల‌క‌మైన పోస్టులో ఉండ‌డంతో ఉన్న‌ట్టుండి కాంగ్రెస్ వైపు చూశారు. ఢిల్లీలో పెద్ద‌ల స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే తిరిగి స్వంత గూటికి చేరుకున్నారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నిక‌ల‌కు సంబంధించి మొత్తం 119 స్థానాల‌కు గాను తొలి విడ‌త‌గా 55 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా జూప‌ల్లి కృష్ణారావుకు(Jupally Krishna Rao) ఊహించిన‌ట్లే కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గాన్ని కేటాయించింది.

ఆయ‌న నేరుగా బీఆర్ఎస్ స‌ర్కార్ ను ఏకి పారేస్తూ వ‌చ్చారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు కోరుకున్న తెలంగాణ రాలేద‌న్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

Also Read : Kasireddy Narayan Reddy : క‌సిరెడ్డికే క‌ల్వ‌కుర్తి

Leave A Reply

Your Email Id will not be published!