Uttam Family : హైదరాబాద్ – రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. మొత్తం 119 సీట్లకు గాను తొలి విడతగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ భారీగా కసరత్తు చేసింది. ఈ మేరకు తొలి విడతగా 55 మందితో అభ్యర్థులను ఖరారు చేసింది. రెడ్డి సామాజిక వర్గానికి ఏకంగా 17 సీట్లు కేటాయించింది పార్టీ.
Uttam Family Got Two seats
ఇదిలా ఉండగా పార్టీ పరంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికీ సీట్లు కేటాయించ కూడదని ఏఐసీసీ ఆధ్వర్యంలో ఉదయ్ పూర్ లో జరిగిన సీడబ్ల్యూసీ కీలక మీటింగ్ లో తీర్మానం చేసింది పార్టీ. కానీ ఆ తీర్మానానికి తిలోదకాలు ఇచ్చింది.
ఇటీవలే భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు తో పాటు ఆయన తనయుడు రోహిత్ కు కూడా రెండు సీట్లు కేటాయించింది. పాలేరుతో పాటు మెదక్ నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు ఛాన్స్ ఇచ్చింది.
ఇదే సమయంలో టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో(Uttam Kumar Reddy) పాటు ఆయన భార్య ఉత్తమ్ పద్మావతి రెడ్డికి రెండు సీట్లను కేటాయించింది పార్టీ. ఉత్తమ్ కుమార్ కు హుజూర్ నగర్ , పద్మావతి రెడ్డికి కోదాడ నియోజకవర్గం ఛాన్స్ ఇచ్చింది. దీంతో భార్యా భర్తలకు సీట్లు కేటాయించడాన్ని పార్టీ పరంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Also Read : Jupally Krishna Rao : జూపల్లికే కాంగ్రెస్ జై
