CM KCR Campaign : కేసీఆర్ ప్రచార రథం సిద్ధం
సీఎం కేసీఆర్ వ్యూహం ప్రారంభం
CM KCR Campaign : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల కోలాహలం నెలకొంది. నవంబర్ 3న గెజిట్ రానుంది. 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 15 దరఖాస్తుల ఉప సంహరణకు గడువు విధించింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 119 సీట్లకు గాను మొత్తం 115 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్.
CM KCR Campaign Van Prepared
ఇదిలా ఉండగా ఆదివారం బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. ఇప్పటికే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ పార్టీ పరంగా ఆరు గ్యారెంటీలతో మేనిఫెస్టోను ప్రకటించింది.
బీజేపీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇదిలా ఉండగా ఎన్నికల సందర్బంగా ఇవాల్టి నుంచే బీఆర్ఎస్ బాస్ కేసీఆర్(CM KCR) ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు సంబంధించి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భారీ గిఫ్ట్ ఇచ్చారు కేసీఆర్ కు.
ఇందుకు గాను అందరినీ ఆకట్టుకునేలా ప్రచార రథాన్ని తయారు చేయించి ఇచ్చారు. దీనిలో అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ ప్రచారం రథంపై కేసీఆర్ ఫోటో, కారు గుర్తు, భారత దేశ పటం, గులాబీ రంగుతో తీర్చిదిద్దారు.
Also Read : Uttam Family : ఉదయ్ పూర్ తీర్మానం బేఖాతర్
