CM KCR : మధిర – తెలంగాణ సీఎం , బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. గత 50 ఏళ్లుగా ఉమ్మడి ఏపీని పాలించిన కాంగ్రెస్ వల్ల ఒరిగింది ఏమీ లేదన్నారు. బలిదానాలు, ఆత్మహత్యలు, ఎన్ కౌంటర్ల పాపం అంతా ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్లనే జరిగిందని ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని మధిరలో జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్(CM KCR) పాల్గొని ప్రసంగించారు.
CM KCR Slams Congress Party
ఈ సందర్బంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను టార్గెట్ చేశారు సీఎం. ఆయనకు అంత సీన్ లేదన్నారు. ఇక్కడ గెలిచేది తామేనంటూ ప్రకటించారు. ఇక మూట ముల్లె సర్దుకోవాలంటూ ఎద్దేవా చేశారు. ప్రజలపై ప్రేమతో కాదు ప్రత్యేక పరిస్థితుల్లో, గత్యంతరం లేక ఆనాడు తాను పోరాటం చేస్తే కాంగ్రెస్ దిగి వచ్చిందన్నారు. అప్పుడే తెలంగాణ రాష్ట్రం ప్రకటించిందని అన్నారు.
ఈ మొత్తం చావులకు, ఆత్మహత్యలకు , కరెంట్ కోతలకు, నీళ్ల కరువుకు కాంగ్రెస్ పార్టీనే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. తాను ముందుండి పోరాటం చేయడం వల్లనే తెలంగాణ ఏర్పడిందన్నారు. ఇవాళ సన్నాసులు తన గురించి అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆనాడు తాను ఉద్యమిస్తున్న సమయంలో వీళ్లంతా ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు.
Also Read : Bhatti Vikramarka : హస్తం విజయం తథ్యం – భట్టి
