PM Modi : కామారెడ్డి – తెలంగాణలో జనం మార్పు కోరుకుంటున్నారని , కమలం పార్టీపై పూర్తి నమ్మకంతో ఉన్నారని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో మోదీ(PM Modi) ప్రసంగించారు. సకల జనులంతా మూకుమ్మడిగా బీజేపీ వైపు చూస్తున్నారని స్పష్టం చేశారు.
PM Modi Words
బీఆర్ఎస్ పాలన నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నారని అన్నారు మోదీ. ఇవాళ కేవలం ఒకే ఒక్క కుటుంబానికే తెలంగాణ పరిమితమై పోయిందని, ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. బీజేపీ ఏం చెబుతుందో అదే చేసి చూపిస్తుందని చెప్పారు.
ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించే సత్తా ఒక్క తమ పార్టీకి మాత్రమే ఉందన్నారు. ఇవాళ దేశ వ్యాప్తంగా సుస్థిరమైన పాలన ను కోరుకుంటున్నారని అది కేవలం తమ పార్టీ వల్ల సాధ్యవుతుందని నమ్ముతున్నారని తెలిపారు.
అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన ఘనుడు కేసీఆర్ అని ఆరోపించారు. దీని వల్ల బీఆర్ఎస్ పాలనను జీర్చించు కోలేక పోతున్నారని, భరించే స్థితిలో లేరని పేర్కొన్నారు మోదీ. త్వరలోనే జరిగే ఎన్నికల్లో తాము కీలకమైన పాత్ర పోషించ బోతున్నామని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి.
Also Read : Mallikarjun Kharge : అధికారం అస్తవ్యస్తం పాలన దారుణం
