VC Sajjanar : బ‌స్సులు కొంటాం జాబ్స్ భ‌ర్తీ చేస్తాం

టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్

VC Sajjanar : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన నూత‌న ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు నూత‌న బ‌స్సుల‌ను కొనుగోలు చేస్తామ‌న్నారు. ఇదే స‌మ‌యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌హిళ‌ల‌కు ఉచితంగా ప్ర‌యాణం చేసే నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. ప్ర‌తి రోజూ నాలుగున్న‌ర ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు రాష్ట్ర వ్యాప్తంగా జ‌ర్నీ చేస్తున్నార‌ని చెప్పారు.

VC Sajjanar Comment

శుక్ర‌వారం ఎండీ స‌జ్జ‌నార్ మీడియాతో మాట్లాడారు. మ‌హిళ‌ల‌కు ఇచ్చే ఈ స‌దుపాయాన్ని ఇవ్వ‌డం వ‌ల్ల ఆర్టీ సీ సంస్థ‌పై అద‌న‌పు భారం ప‌డుతుంద‌న్నారు. అయితే ఈ భారం ద్వారా అయ్యే ఖ‌ర్చుకు సంబంధించిన మొత్తాన్ని ప్ర‌భుత్వం త‌మ‌కు జ‌మ చేస్తుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చార‌ని చెప్పారు.

త్వ‌ర‌లోనే కొలువుల భ‌ర్తీకి సంబంధించి విధి విధానాల‌ను, మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు ఎండీ స‌జ్జ‌నార్(VC Sajjanar). నిరుద్యోగులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. కొత్త ప్ర‌భుత్వం ప్ర‌జా ప్ర‌భుత్వ‌మ‌ని పేర్కొన్నారు. ఒక ర‌కంగా మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం సంచ‌ల‌న నిర్ణ‌య‌మ‌ని ప్ర‌శంసించారు.

Also Read : Telangana Govt : రేపే మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం

Leave A Reply

Your Email Id will not be published!