Covid19 : కరోనా కేసులు తప్పని తిప్పలు
తెలుగు రాష్ట్రాలలో కలకలం
Covid19 : న్యూఢిల్లీ – నిన్నటి దాకా ప్రశాంతంగా ఉన్న దేశంలో ఉన్నట్టుండి మరోసారి కరోనా(Covid19) విజృంభిస్తోంది. కేసుల పరంపర కొనసాగుతోంది. కొత్త వేరియంట్ జేఎన్1 కేరళ రాష్ట్రంలో ప్రారంభమైంది. అత్యధికంగా కేసులు ఇక్కడే పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది.
Covid19 Cases Raising
ఇదే సమయంలో రోజు రోజుకు కరోనా కేసులు విజృంభిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇక తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో కూడా కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 10 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇబ్బందికరంగా మారింది. ఇక ఏపీలో 29కి చేరాయి కరోనా కేసుల సంఖ్య.
కరోనా పంజా.. 24 గంటల్లో తెలంగాణలో 10 పాజిటివ్ కేసులు.. ఏపీలో 29కి యాక్టివ్ కేసులు చేరాయి. మరో వైపు కేంద్ర సర్కార్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆస్పత్రులలో వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
Also Read : Chiranjeevi : రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటి