CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి – సీఎం రేవంత్‌రెడ్డి
జూబ్లీహిల్స్‌లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి - సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల ఇన్‌ఛార్జిలతో సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో సమీక్ష చేపట్టారు. ఉప ఎన్నిక గెలుపు కోసం క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని సీఎం సూచించారు.పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ ఇంచార్జ్ మంతరులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌లతో సర్వే ఏజెన్సీల నుంచి పలువురు హాజరయ్యారు.
CM Revanth Reddy Key Comments on Jubilee Hills
ఈ సందర్భంగా సీఎం రేవంత్ (CM Revanth Reddy) మాట్లాడుతూ… ‘‘నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలి. కాంగ్రెస్ తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుంది. అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది. పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మీపైనే ఉంది. మీ పనితీరుతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నా. జూబ్లీహిల్స్‌లో (Jubilee Hills) పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలి’’ సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక ఏఐసీసీ చూసుకుంటుంది – సీఎం రేవంత్
జూబ్లీహిల్స్ రేసులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్‌లు పోటీలు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై సీక్రెట్ సర్వే రిపోర్ట్‌ను పీసీసీ చీఫ్ ముఖేష్ కుమార్ గౌడ్… సీఎం రేవంత్ కు అందజేశారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మీపై ఉంది. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటా. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలి’ అని పేర్కొన్నారు.
కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అంటున్నారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభవృద్ధి కోసం కృషి చేశానన్నారు. ఎంపీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశానన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా తన మనసులోని మాటను వెల్లడించారు అంజన్ కుమార్ యాదవ్.
‘నా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. అందులో భాగంగా నాకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలిఉమ్మడి ఏపీ నుండి యాదవ సామాజికవర్గంకి మంత్రి పదవి కేటాయించారు. నాకన్న సీనియర్లు ఎవరు లేరు… నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రాతినిథ్యం లేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చి మంత్రి ఇవ్వాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నేను ఉన్న ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి. జూబ్లీహిల్స్‌లో సర్వే చేస్తే అంజన్ కుమార్ యాదవ్ పేరు వస్తుంది’ అని పేర్కొన్నారు.
Also Read : Supreme Court: వక్ఫ్ చట్టం-2025లో ఓ ప్రొవిజన్ నిలిపేసిన సుప్రీంకోర్టు
