Rahul Gandhi: తన ఫోన్ నంబర్ షేర్ చేయడంపై రాహుల్ పై యూపీ వ్యక్తి ఆగ్రహాం
తన ఫోన్ నంబర్ షేర్ చేయడంపై రాహుల్ పై యూపీ వ్యక్తి ఆగ్రహాం
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… విచిత్రమైన వివాదంతో చిక్కుకున్నారు. బీజేపీ ‘ఓటు చోరీ’కు ఎన్నికల కమీషన్ ను సహకరిస్తుందంటూ మీడియా సమావేశం నిర్వహించి సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టారు. అయితే ఇటీవల రాహుల్ గాంధీ నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ నెంబర్ ను షేర్ చేసారట. దీనితో ఆ వ్యక్తికి గురువారం నుండి విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఏంటా అని ఆరా తీస్తే… కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో తన ఫోన్ నంబరును బహిర్గతం చేశారంటున్నారు.
Rahul Gandhi – ఇంతకీ ఏం జరిగిందంటే ?
‘ఓటు చోరీ’ అంశంపై కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం మధ్యలో రాహుల్ తన ఫోన్ నెంబర్‌ను పేర్కొన్నారని మిశ్రా ఆరోపిస్తున్నారు. దీంతో ఆ ప్రెస్‌మీట్ తర్వాత నుంచి తనకు విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. తాను 15 ఏళ్లుగా అదే ఫోన్ నెంబర్ వాడుతున్నానని… ఇప్పుడు వరుసగా కాల్స్ వస్తుండడంతో తనకు సమస్యగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నట్లుగా అసలు తాను ఓటరు తొలగింపు విషయంలో ఎటువంటి దరఖాస్తూ చేయలేదని వెల్లడించారు. ప్రెస్ బ్రీఫింగ్లో రాహుల్ తన ఫోన్ నెంబర్‌ను పేర్కొన్నారని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. ఎలాంటి దరఖాస్తు పెట్టనప్పుడు తన నెంబర్ వారి దగ్గరకు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. ఈవిషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు.
రాహుల్ గాంధీ గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… గుర్తుతెలియని వ్యక్తులు సాఫ్ట్వేర్ ద్వారా వ్యవస్థీకృతంగా వివిధ రాష్ట్రాల్లో తమ ఇష్టానుసారం ఓటర్ల జాబితాల్లో మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని అలంద్, మహారాష్ట్రలోని రజోరా అసెంబ్లీ నియోజకవర్గాలే దీనికి ఉదాహరణ అని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నవారిని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్ రక్షిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. బయటి రాష్ట్రాల ఫోన్లను ఉపయోగించి అలంద్‌లో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అగంతకులు 6,018 ఓట్లను తొలగిస్తే, అదే విధానంలో మహారాష్ట్రలోని రజోరా నియోజకవర్గంలో 6,850 మంది కొత్త ఓటర్లను చేర్చారని వెల్లడించారు. ఈ క్రమంలో పలువురి పేర్లు, వారికి సంబంధించిన వివరాలను ఆయన మీడియా ముందు వెల్లడించారు.
Also Read : Pawan Kalyan: ప్లాస్టిక్ రహిత ఏపీ మా లక్ష్యం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
