కేరళ : కేరళ స్టార్ క్రికెటర్, మాజీ రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కిప్పర్ సంజూ శాంసన్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. భారత్ , శ్రీలంక సంయుక్తంగా ప్రస్తుతం ఐసీసీ టి20 వరల్డ్ కప్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే బాయ్ కాట్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ కు పాల్పడిన పాకిస్తాన్ జట్టు ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకుంది. ఐసీసీతో పాటు అంతర్జాతీయ పరంగా టాప్ మోస్ట్ కంపెనీల దెబ్బకు దిగి వచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ మేరకు పాకిస్తాన్ మనసు మార్చకుంది. ఈ నెల 15వ తేదీన శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా భారత్ తో ఆడతామని ప్రకటించింది. దీంతో హై హీట్ పెరుగుతోంది క్రికెట్ వర్గాలలో. ఈ మ్యాచ్ లో తమ అభిమాన ఆటగాడు సంజూ శాంసన్ ను ఆడించాలని అభిమానులు పెద్ద ఎత్తున కోరుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు బీసీసీఐని. అయితే రాక రాక జాతీయ జట్టుకు ఆడేందుకు ఛాన్స్ వస్తే దానిని చేజేతులారా పోగొట్టుకున్నాడు సంజూ శాంసన్. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన 5 టి20 సీరీస్ లో తను చేసిన పరుగులు కేవలం 50 రన్స్ మాత్రమే. 10, 6, 0, 24, 6 పరుగులు చేశాడు. కోట్లాది అభిమానులు కలిగిన శాంసన్ చివరకు నిరాశ పర్చడంతో అంతా విస్తు పోయారు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ సైతం బాగా ఆడతాడని అనుకుంటే అమెరికా జట్టుతో జరిగిన మ్యాచ్ లో తేలి పోయాడు. దీంతో శాంసన్ కు ఒక్క మ్యాచ్ ఆడేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు ఫ్యాన్స్.
