అమరావతి : ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ 16వ శాసనసభ 5వ బడ్జెట్ సమావేశాల తొలిరోజే సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. నిన్న గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రవర్తన వల్ల సభా గౌరవం దెబ్బతింటోందని ఆయన వ్యాఖ్యానించారు . యువతకు , విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో లోకేష్ ‘మాక్ అసెంబ్లీ’ అనే కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు లభించిందని, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు సైతం దీన్ని ప్రశంసించారని స్పీకర్ గుర్తుచేశారు.
నిన్న గవర్నర ప్రసంగిస్తున్నప్పుడు సభలో జరిగిన దృశ్యాలు నన్ను కలచివేశాయి. సభ్యులు నినాదాలు చేస్తూ, కాగితాలు చింపి వేయడం వంటి చర్యలు అత్యంత బాధాకరం అని స్పీకర్ అన్నారు. వేలాది మంది పోటీ పడితే కేవలం 175 మందికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం ఈ సభలో సభ్యులుగా ఉండటం అని గుర్తించాలన్నారు. ఆ గౌరవాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చింతకాయల అయ్యన్నపాత్రుడు గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200లకు పైగా విద్యాసంస్థల నుండి విద్యార్థులు అసెంబ్లీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని స్పీకర్ తెలిపారు. మనం చేసే పనులను చూసి ఆ పసిపిల్లలు ఏం నేర్చుకుంటారు? చట్ట సభలంటే వారికి చులకన భావం ఏర్పడితే దాన్ని మనం మళ్ళీ మార్చలేమని ఆందోళణ వ్యక్తం చేశారు.
Breaking
- కుల గణనపై తీర్మానం చేయాలి : ఎంకే స్టాలిన్
- ఇరాన్ పై విరుచుకు పడిన అమెరికా
- ‘వికసిత్ భారత్’ సాధనకు ఆరోగ్యవంతులైన పౌరులే కీలకం
- హైదరాబాద్ లో ‘టీసీఎస్ – హైపర్ వాల్ట్’ ఏఐ డేటా సెంటర్
- కాంగ్రెస్ సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయి : కేటీఆర్
- 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘సింగరేణి’ రైలు
- పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ శ్రీకారం
- నాపై జైలులో విష ప్రయోగం చేశారు : సంజయ్ రౌత్
- మాజీ మంత్రి నెహ్రూపై దాడులు కక్ష సాధింపు కాదు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు