కోల్ కతా : ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. కీలకమైన విండీస్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. సెమీ ఫైనల్ కు చేరింది. ఈసందర్బంగా భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు. తన జీవితంలో మరిచి పోలేని మ్యాచ్ ఇది అని పేర్కొన్నాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయంలో తమ అంచనాలకు మించి ఆడాడంటూ సంజూ శాంసన్ గురించి పేర్కొన్నాడు. తను చివరి దాకా నిలవడమే కాదు కీలకమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడని, కోట్లాది ప్రజల హృదయాలను గెలుచుకున్నాడని ప్రశసంలు కురిపించారు సూర్య కుమార్ యాదవ్.
ఒక రకంగా చెప్పాలంటే సంజూ శాంసన్ గనుక మైదానంలో లేక పోయి ఉంటే భారత జట్టు సెమీస్ కు చేరుకుని ఉండేది కాదన్నాడు. కళాత్మకమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడని తెలిపాడు. పూర్తిగా పాత స్టైల్ క్లాసిక్ బ్యాటింగ్ తో మనసు దోచుకున్నాడని ప్రశంసించాడు సూర్య కుమార్ యాదవ్. ఇదే క్రమంలో కామెంటేటర్ బాక్స్ లో ఉన్న మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. యాభై పూర్తి చేసిన వెంటనే విశ్రాంతి తీసుకోకు, సిక్స్ కొట్టడానికి తొందరపడి బయటకు వెళ్లకు. మళ్ళీ గార్డ్ ఫ్రెష్ గార్డ్ తీసుకొని, కొత్త లైన్లు గీయడం, మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడం, మళ్ళీ అతను పిచ్ అర్థం చేసుకున్నట్లుగా రెండు బంతుల డిఫెన్స్ ఆడాడు.. అంటే అతను భారతదేశం గెలిపించే వరకు తన విధి పూర్తి కాదని అతనికి తెలుసు అని పేర్కొన్నాడు.
