తమిళనాడు : తమిళనాడు రాష్ట్రంలో ఇవాల్టిలో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్ కూటమి, అన్నాడీఎంకే, భారతీయ జనతా పార్టీ ఇండియా కూటమితో పాటు దళపతి విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించు కోనున్నాయి. ఇప్పటికే ప్రచారంలో ఒకరిని మించి మరొకరు ప్రచారాన్ని చేపట్టారు. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే పవర్ లో ఉంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 21న సాయంత్రం నాటితో క్యాంపెయిన్ ముగియనుంది. దీంతో ఆయా పార్టీలన్నీ ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో అన్ని సర్వేలు ఆయా పార్టీలపై ఫోకస్ పెట్టాయి. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉన్నాయని , తాము మరోసారి పవర్ లోకి వస్తామని ధీమాతో ఉన్నారు డీఎంకే పార్టీ చీఫ్ సీఎం ఎంకే స్టాలిన్.
మరో వైపు ఈనెల 23న పోలింగ్ జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా . ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇక ఇప్పటి వరకు ఎన్నికల క్యాంపెయిన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించచారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్న ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ, డీఎంకే నేతృత్వంలోని ఎస్పీఏ అభ్యర్థుల కోసం రోడ్‌షోలు నిర్వహిస్తూ ప్రచారం చేశారు
