చెన్నై : స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ మరోసారి నిరాశ పరిచినా సీఎస్కే సూపర్ షో చేసింది. ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా జరిగిన కీలక పోరులో ఊహించని రీతిలో ముంబై ఇండియన్స్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. మరోసారి చెన్నై బౌలర్లు చెలరేగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై కేవలం 159 పరుగులకే పరిమితమైంది. ఇదే టోర్నీలో వాంఖడే స్టేడియం వేదికగా చిత్తుగా ఓడించింది ముంబై ఇండియన్స్ జట్టును సీఎస్కే. మరో వైపు స్వంత మైదానంలో సైతం సత్తా చాటింది సీఎస్కే. ఈసారి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రాలేదు. తను టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ తన నిర్ణయం తప్పని తేలింది. టోర్నీలో ముంబై ఇండియన్స్ కు ఇది వరుసగా ఏడో ఓటమి కావడం గమనార్హం.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ లో 7 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులో నమన్ ధీర్ ఒక్కడే ఆడాడు. తను 37 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 57 రన్స్ చేశాడు. ర్యాన్ రికల్టన్ 24 బంతుల్లో 5 భారీ సిక్సులతో 37 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేసింది ముంబై ఇండియన్స్. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 32 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే నూర్ అహ్మద్ 26 రన్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. అనంతరం బరిలోకి దిగిన సీఎస్కే కెప్టెన్ మరోసారి బాద్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తను 48 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 2 సిక్సులతో 67 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. కార్తీక్ శర్మ 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 18.1 ఓవర్ లోనే 160 రన్స్ చేసింది.
