పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కు గుజ‌రాత్ టైటాన్స్ షాక్

4 వికెట్ల తేడాతో హ్యట్రిక్ విక్ట‌రీ సాదించిన టీం

అహ్మ‌దాబాద్ : వ‌రుస విజ‌యాల‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు వ‌ణుకు పుట్టించిన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. ఐపీఎల్ లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో ఉన్న‌ట్టుండి జోరు పెంచింది గుజ‌రాత్ టైటాన్స్. స్వంత గ‌డ్డపై ఆ జ‌ట్టు స‌మిష్టి ఆట‌తీరుతో ఆక‌ట్టుకుంది. 4 వికెట్ల తేడాతో ఓడించి వ‌రుస‌గా మూడు మ్యాచ్ ల‌లో గెలుపొంది ఝ‌ల‌క్ ఇచ్చింది. జేస‌న్ హోల్డ‌ర్, సాయి సుద‌ర్శ‌న్, వాసింగ్ట‌న్ సుంద‌ర్ లు అద్భుతంగా రాణించారు.

మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 163 ర‌న్స్ చేసింది. గుజ‌రాత్ బౌల‌ర్ల దెబ్బ‌కు బ్యాట‌ర్లు ఇబ్బంది ప‌డ్డారు. ఒక ద‌శ‌లో ఆ జ‌ట్టు 47 ప‌రుగుల‌కే 5 కీల‌క విక‌ట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో మైదానంలోకి వ‌చ్చిన సూర్యాంశ్ షెడ్గే దుమ్ము రేపాడు. కేవ‌లం 39 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు , 5 సిక్స‌ర్లతో విరుచుకు ప‌డ్డాడు. త‌న‌కు తోడుగా మార్క‌స్ స్టోయినిస్ 31 బంతులు ఆడి 5 ఫోర్లు ఒక సిక్స్ తో 40 ర‌న్స్ చేశారు. ఇక గుజ‌రాత్ బౌల‌ర్లు జేస‌న్ 24 ర‌న్స్ ఇచ్చి 4 వికెట్లు తీస్తే ర‌బాడా 22 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు, సిరాజ్ 28 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. అనంత‌రం సాయి సుద‌ర్శ‌న్ 41 బంతులు ఆడి 5 ఫోర్లు 1 సిక్స్ తో 57 ర‌న్స్ చేయ‌గా సుంద‌ర్ 23 బంతులు ఆడి 5 ఫోర్లు ఒక సిక్స్ తో 40 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో 19.5 ఓవ‌ర్ల‌లో 167 ర‌న్స్ చేసింది..విజ‌యం సాధించింది.

Leave A Reply

Your Email Id will not be published!