ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి వేగం పెరిగింది

రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్

విజయవాడ : ఏపీలో భార‌తీయ జ‌న‌తా పార్టీ కూట‌మి స‌ర్కార్ దేశానికే ఆద‌ర్శ ప్రాయంగా అభివృద్దిలో ముందుకు దూసుకు పోతోంద‌ని ప్ర‌శంస‌లు కురిపించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం మాధవ్ అధ్యక్షతన సమావేశం జ‌రిగింది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎంపి దగ్గుబాటి పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యులు పాకా‌ సత్యనారాయణ , ఎమ్మెల్యే లు, ఆఫీస్ బేరర్స్ ఈ కీల‌క స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పీవీఎన్ మాధ‌వ్ ప్ర‌సంగించారు. ఏపీలో సర్ పై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ప‌శ్చిమ బెంగాల్‌ గెలుపు మనకు ఒక సెంట్ మెంట్ అని పేర్కొన్నారు. మమత బెనర్జీ లో మమత అనేది లేకుండా అనేక అరాచకాలు స్రుష్టించిందని ఆరోపించారు మాధ‌వ్.

పశ్చిమ బెంగాల్ విజయం దేశానికే తలమానికమైనదని అన్నారు. పాండిచ్చేరి, అస్సాం లో గెలుపు మ‌రింత ఉత్సాహాన్ని ఇచ్చేలా చేసింద‌న్నారు. ఇక కేరళ లో మూడు సీట్లు వ‌చ్చాయ‌ని, త్వరలో అక్కడ క‌కూడా అధికారంలోకి వస్తాం అని జోష్యం చెప్పారు. తమిళనాడులో విజయ్ గెలుపును స్వాగతిస్తున్నాం అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి విస్తరిస్తుంద‌ని చెప్పారు. తెలంగాణాలో మోదీ సభ ఉండబోతోంద‌ని, అనేక విషయాలపై మోదీ ప్రసంగిస్తారని అన్నారు. ముస్లింలు బిజెపికి ఓటు వేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాలు కలవాలి అందరినీ కలపాలన్నారు .అమరావతకి శాశ్వత హోదా ఇవ్వడం ద్వారా దీర్ఘకాలిక సమస్య పరిష్కారమయ్యింది అని చెప్పారు మాధ‌వ్.

విశాఖ రైల్వే జోన్ రావడం చిన్న విషయం కాద‌న్నారు. జూన్ 1 నుంచి విశాఖ పూర్తి రైల్వే జోన్ గా మారుతుంద‌న్నారు. రైల్వే జోన్ రావడంలో బిజెపి పాత్ర కీలకం అని పేర్కొన్నారు. విభజన చట్టం లోని అన్ని అంశాలను సాధించామ‌ని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా 15 లక్షల కోట్లు కేంద్ర సహకారం తో ఏపీకి వ‌చ్చాయ‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!