పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ ఆశ‌ల‌పై ఆర్సీబీ నీళ్లు

18 పాయింట్లో ప్లే ఆఫ్స్ రేసులో టాప్ లోకి

ధ‌ర్మ‌శాల : ఐపీఎల్ 19లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ చిత్త‌యింది. తాజాగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ఈ విజ‌యంతో 18 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్ రేసులో టాప్ లోకి దూసుకు వెళ్లింది డిఫెండింగ్ ఛాంపియ‌న్. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో దుమ్ము రేపుతోంది. మ‌రోసారి టైటిల్ ను కైవ‌సం చేసుకునేందుకు రెడీ అయ్యింది. మాజీ కెప్టెన్ ర‌న్ మెషీన్ గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్ ఆ జ‌ట్టుకు బ‌లంగా మారింది. ఇక బౌల‌ర్ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆ జ‌ట్టు ఇప్పుడు చెన్నై సూప‌ర్ కింగ్స్ తో ఆడాల్సి ఉంది. వెంక‌టేశ్ అయ్య‌ర్, విరాట్ కోహ్లీ కీల‌క పాత్ర పోషించ‌డంతో ఆర్సీబీ గెలుపొందింది.

ఈ ప‌రాజ‌యంతో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ ప్లే ఆఫ్స్ ఆశ‌లపై నీళ్లు చ‌ల్లింది. 23 ప‌రుగుల తేడాతో ఓడి పోయింది. అయ్య‌ర‌ర్ 40 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 73 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిస్తే కోహ్లీ 37 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 58 ప‌రుగులు చేయ‌డంతో భారీ స్కోర్ సాధించింది. 4 వికెట్లు కోల్పోయి 222 ర‌న్స్ చేసింది. ఆర్సీబీకి ఇది 9వ విజ‌యం కాగా పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కు ఇది వ‌రుస‌గా ఆరోసారి. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్‌ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే చాప చుట్టేసింది. శశాంక్‌ సింగ్‌ 27 బంతుల్లో 56 ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేక పోయాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో మ‌రోసారి స‌త్తా చాటారు స‌లామ్ 36 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే భువ‌నేశ్వ‌ర్ కుమార్ 38 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు.

Leave A Reply

Your Email Id will not be published!