ఢిల్లీ : నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగింది ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ . రాజస్తాన్ రాయల్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు గెలుపొందేందుకు పోరాడాయి. కానీ చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని సాధించింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక విజయం సాధించాల్సిన ఈ మ్యాచ్ లో చేతులెత్తేసింది రాజస్థాన్ రాయల్స్. ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ 40 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు. తను వరుసగా వికెట్లు తీసి ప్రభావం చూపించాడు. ఢిల్లీ జట్టులో కేఎల్ రాహుల్ 42 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 3 సిక్సర్లతో 56 రన్స్ చేశాడు. అభిషేక్ పోరల్ 31 బాల్స్ ఎదుర్కొని 7 ఫోర్లు 1 సిక్స్ తో 51 పరుగులు చేశాడు.
దీంతో ప్రత్యర్థి జట్టుకు చెందిన రాజస్తాన్ రాయల్స్ పై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో సత్తా చాటింది. రాజస్తాన్ రాయల్స్ తమ ముందు ఉంచిన 194 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఈ గెలుపు ఆ జట్టుకు అదనపు బలాన్ని చేకూర్చి పెట్టింది. ఆరంభంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పరాజయాల బాట పట్టినా ఆ తర్వాత వరుస విజయాలతో ముందుకు సాగింది. ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తోంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో మెరుగైన ప్రదర్శనతో ఈ గెలుపు సాధించింది. ఇక ఎప్పటి లాగే వండర్ బాయ్ అభిషేక్ సూర్యవంశీ మరోసారి రెచ్చి పోయాడు. తనతో పాటు కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా ఆఫ్ సెంచరీ చేసినా గట్టెక్కించ లేకపోయారు.
