న్యూఢిల్లీ : భారత దేశం మరోసారి లాక్ డౌన్ పరిస్థితిని ఎదుర్కోనుందా. అవుననే ప్రచారం జోరుగా జరుగుతోంది. విశ్వ గురు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్న ప్రధాని మోదీ నాయకత్వంలో ఇండియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బలహీనమైన విదేశీ సంబంధాల కారణం కూడా జనం పాలిట శాపంగా మారింది. తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గత దశాబ్దంలో తీసుకున్న కొన్ని నిర్మాణాత్మక నిర్ణయాల ఫలితమే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు భారీ ఎఫెక్టు చూపించింది. చిన్న , మధ్య తరహా పరిశ్రమలను బలహీన పరిచేలా చేసింది. వీటి ద్వారానే కోట్లాది మంది ఆధారపడి జీవన సాగిస్తారు.
జీఎస్టీ ప్రభావం కూడా ఆర్థిక వ్యవస్థపై భారం మోపేలా చేసింది. జీఎస్టీ అవసరమైనప్పటికీ అది పెద్ద సంస్థల వైపు అధికారం కేంద్రీకృతం అయ్యేలా చేసి, చిన్న వ్యాపారాలను ఒత్తిడికి గురిచేసింది.2019 కార్పొరేట్ పన్ను కోత కంపెనీలకు లాభాలు తెచ్చినా, అవి పెట్టుబడులుగా లేదా కొత్త ఉద్యోగాలు సృష్టించ లేక పోయాయి. పీఎల్ఐ వంటి భారీ పెట్టుబడి పథకాలు అవసరమైన స్థాయిలో ఉద్యోగాలను సృష్టించలేక పోయాయి. 2015–2026 మధ్య ఏఐ (AI) రంగంలో దేశంగా సరైన పునాది వేయలేక పోయింది. ఇప్పటికీ ఐటీ రంగం అవుట్ సోర్సింగ్ పైనే ఆధార పడింది. ప్రైవేట్ రంగంలో ఆర్ అండ్ డి పెట్టుబడులు తక్కువగా ఉండటం వల్ల ఆవిష్కరణలు, ఉత్పాదకత బలహీనంగా ఉండడం కూడా మరో కారణం.
చైనా దిగుమతులు పెరిగాయి. ఇదే సమయంలో వాణిజ్య లోటు పెరుగుతోంది. విదేశీ పెట్టుబడిదారుల నమ్మకం కొంత తగ్గి, పీపీఐ ప్రవాహాలు అస్థిరంగా మారాయి. అంతే కాకుండా ఎఫ్డీఐ కూడా ఆశించిన లేకుండా పోయింది. వాస్తవ ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా వేతనాలు పెరగక పోవడం వల్ల కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది. దేశీయ ముడి చమురు ఉత్పత్తి తగ్గి, దిగుమతులపై ఆధార పడటం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఇటీవల జరిగిన ఇరాన్ యుద్ధం ఈ సమస్యలను సృష్టించ లేదు. ఇవన్నీ ముందే ఉన్నాయి. అది కేవలం ఈ లోపాలను బయట పెట్టింది. దీనికంతటికీ కారణం మోదీ బీజేపీ ప్రభుత్వమే.