అమరావతి : తనపై స్వంత పార్టీకి చెందిన మీడియా సంస్థ బిగ్ టీవీ ( సీఎం రేవంత్ రెడ్డి కి చెందిన ) ఛానల్ పనిగట్టుకుని డ్యామేజ్ చేస్తూ వరుసగా కథనాలు ప్రసారం చేయడం పట్ల స్పందించారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. మీడియా వల్ల అధికారంలోకి రాలేమని, కేవలం క్యాడర్ వల్లనే సాధ్యం అవుతుందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొందరు కావాలని ప్రసారం చేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదన్నారు. ఈ మేరకు శనివారం కీలక ప్రకటన విడుదల చేశారు. సమన్వయంతో ఉండాలని, ప్రజాస్వామ్య విలువలతో కూడిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు.
పత్రిక స్వేచ్ఛను గౌరవిస్తామని, ఇదే సమయంలో మన పనితీరును నిర్ణయించాల్సింది క్యాడర్ అనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. మీడియా కథనాలు మన పనితీరును కుంగ తీయలేవని పేర్కొన్నారు. నా ప్రాణ సమానమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు ఒక న్యూస్ చానల్ లో నా పైన కాంగ్రెస్ పార్టీ ఒక కల్పిత కథనం రోజంతా ప్రసారం చేశారని తెలిపారు.
అభూత కల్పనలతో, అసత్యాలతో వ్యక్తిగగతంగా అప్రతిష్టపాలు చేసే విధంగా కథనాలు ప్రసారం అయ్యాయి.. అవి చూసిన కాంగ్రెస్ క్యాడర్ చాలా ఆవేశానికి, ఆగ్రహానికి గురయ్యారు. అయితే మనం, మన పార్టీ రాజ్యాంగ బద్దంగా పని చేసే విధానాన్ని అలవర్చుకున్నాం.. మనకు పత్రిక స్వేచ్ఛ పట్ల.. భావ ప్రకటన స్వేచ్ఛ పట్ల గౌరవం ఉందన్నారు.
ఆ చానల్.లో ఏదో ప్రసారం చేసినంత మాత్రాన మనం హర్ట్ కావాల్సిన అవసరం లేదన్నారు.. మన పని తీరును నిర్ణయించాల్సింది క్యాడర్ తప్ప మీడియా కాదు. అన్నింటికీ కాలమే సమాధానం చెపుతుందని అన్నారు టీపీసీసీ చీఫ్.