దేశాన్ని కుదిపేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ

మిలియ‌న్ల కొద్దీ ఫాలోయ‌ర్స్ పెర‌గ‌డం

న్యూఢిల్లీ : ఏ ముహూర్తాన భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి (సీజేఐ) జ‌స్టిస్ సూర్య‌కాంత్ నిరుద్యోగుల‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేశారో దేశ వ్యాప్తంగా ఆందోళ‌న నెల‌కొంది. అమెరికా వేదిక‌గా ప్ర‌వాస భార‌తీయుడు ఒక‌రు ఏర్పాటు చేసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. సామాజిక మాధ్య‌మాల‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. పెద్ద ఎత్తున అన్ని వ‌ర్గాల నుంచి కాక్రోచ్‌ జనతా పార్టీకి జెన్‌ జీ నుంచి మద్దతు ల‌భిస్తోంది. దీని దెబ్బ‌కు కేంద్రంలోని బీజేపీ, మోదీ స‌ర్కార్ వ‌ణుకుతోంది. ప్ర‌ధానంగా ఈ పార్టీ బీజేపీని ల‌క్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసింది కావ‌డంతో జ‌నం , నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆద‌రిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు.

నిరుద్యోగులను బొద్దింకలుగా సంభోదించిన చీఫ్ జస్టిస్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. దెబ్బ‌కు దిగి వ‌చ్చారు సీజేఐ. అయితే తాను అన్న‌ది వేరే కోణంలో న‌ని స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన డ్యామేజ్ జ‌రిగి పోయింది. ఆన్‌లైన్‌లో కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేశాడు అభిజీత్. ఇదిలా ఉండ‌గా బీజేపీ, కాంగ్రెస్‌లకు మించి ఫాలోయింగ్ ఏర్ప‌డుతోంది. దీంతో ఇండియాలో దానిని ట్విట్ట‌ర్ లో బ్యాన్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్రస్తుతం CJP ఫాలోవర్ల సంఖ్య 20.4 మిలియన్లు కావ‌డం విశేషం. మే 16న‌ ఆవిర్భావించిన CJP.. AIతో ఒక్క రాత్రిలో మేనిఫెస్టోను డిజైన్ చేసింది. కొందరు వాలంటీర్లు ఏకంగా బొద్దింకల దుస్తులు ధరించి రోడ్లపై స్వచ్ఛందంగా క్లీన్-అప్ డ్రైవ్‌లు, నిరసన‌ల‌కు దిగారు.

Leave A Reply

Your Email Id will not be published!