జ‌గ‌న్ రెడ్డి గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం

మంత్రి అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్

అమరావతి : హత్యా రాజకీయాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్టు అని మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. సమాజంలో విద్వేషాలు, హింస, కక్ష రాజకీయాలను పెంచే గొడ్డలి పార్టీ రాష్ట్రానికి హానికరమని మండిపడ్డారు. ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు. త‌న‌లో ప‌ద‌వి పోయింద‌న్న ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపించిందన్నారు. రాష్ట్రంలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నాయకత్వంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుంటే తట్టుకోలేక వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. రెండేళ్ల పాలనలో విమర్శించడానికి ఒక్క అంశం కూడా దొరక్క చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ లాంటి స్వభావం ఉన్న వ్యక్తులు వస్తారని ముందే గుర్తించి దర్శకుడు శంక‌ర్ అపరిచితుడు సినిమా తీశారేమో అనిపిస్తోంది అంటూ ఎద్దేవా చేశారు.

జగన్ చేసిన వ్యాఖ్యలతో రాజారెడ్డి దమనకాండ, నాటి చరిత్ర, వైఎస్ కుటుంబ రాజకీయ నేపథ్యం మొత్తం మళ్లీ చర్చకు వచ్చాయని అన్నారు. నేటి తరానికి వైఎస్ కుటుంబ చరిత్ర తెలిసేలా జగన్ స్వయంగా చేసుకున్నారని వ్యాఖ్యానించారు. రాజారెడ్డి హత్య కేసులో ఉన్న నిందితులందరినీ చంపేశారని, ఒక్క పార్థసారధి రెడ్డి మాత్రమే మిగిలారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఈరోజు వైసీపీలో ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నాడని పరోక్షంగా ప్రస్తావించారు. అలాగే వంగవీటి రంగా హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కుటుంబ సభ్యులు కూడా జగన్ పార్టీలోనే ఉన్నారని గుర్తు చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!