న‌టించ‌డంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నెంబ‌ర్ వ‌న్

తప్పుచేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు

జమ్మలమడుగు: అద్భుత నటుడు జగన్మోహన్ రెడ్డి అని, మతాల మధ్య చిచ్చుకు కుట్ర పన్నారని, తప్పుచేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హెచ్చ‌రించారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం దత్తలూరు వద్ద ఏర్పాటు చేసిన వేదికలో జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. కష్టకాలంలో పసుపు జెండాకు అండగా నిలబడిన వ్యక్తి భూపేష్ రెడ్డి అన్నారు. మాటలు తక్కువైనా చేతలు ఎక్కువ. జమ్మలమడుగు జోష్ అదిరి పోయిందన్నారు లోకేష్. పౌరుషాల గడ్డ ఇది. పెన్నా నది నీళ్లలోనే తేడా ఉంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో మూడు సాగునీటి ప్రాజెక్టులు, నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయ‌న్నారు. గండికోటను, టీడీపీని ఎవరూ టచ్ చేయలేరన్నారు లోకేష్‌.

ఉమ్మడి కడప జిల్లా ఎప్పుడూ టీడీపీకి అండగా నిలిచిందన్నారు. గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నాం. కోటిమంది సభ్యులు టీడీపీ సొంతం. బడుగు, బలహీన వర్గాలను ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2019-24 మధ్య అనేక ఇబ్బందులు పెట్టారు. కార్యకర్తలు తెగువ చూపారు. వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారు. జగన్ రెడ్డికి చీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వొచ్చు. అద్భుత నటుడు జగన్మోహన్ రెడ్డి. సినిమాల్లో నటిస్తే ఆస్కార్ అవార్డ్ వస్తుంద‌న్నారు. ఆస్తి కోసం సొంత తల్లి, చెల్లిని బయటకు గెంటేశారు. ఇంకో చెల్లి తండ్రిని చంపి అన్యాయం చేశారు. సొంత జిల్లా ప్రజలను మోసం చేశారు. సొంత బాబాయిని లేపేసి నెపం మనపై నెట్టారన్నారు. గుండెపోటు కాదది.. గొడ్డలిపోటు. కోడికత్తి, గులకరాయి డ్రామా చూశాం. మొన్న కడప పట్టణంలో జరిగింది కూడా అదే కుట్ర. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారు. తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు.

Leave A Reply

Your Email Id will not be published!