న్యూఢిల్లీ : తమిళనాడు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై రాజీనామాను ఆమోదించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్. శుక్రవారం ఈ మేరకు కీలక ప్రకటన చేసింది పార్టీ . కె. అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు పార్టీ చీఫ్. అమిత్ షా తో రాజీనామా కంటే ముందు భేటీ అయ్యారు అన్నామలై. తన రాజీనామా విషయంలో పునరాలించు కోవాలని సూచించారు. అయినా వినిపించు కోలేదు కె. అన్నామలై.
‘ద్రావిడ నమూనా’ తమిళనాడులో బీజేపీ పట్ల ద్వేషాన్ని సృష్టించింది. అయితే, అన్నామలై సమర్థవంతంగా వ్యవహరిస్తే, రాబోయే కాలంలో తమిళనాడు బీజేపీని ఆదరించే అవకాశం ఉంది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన కుప్పుసామి అన్నామలై బీజేపీలో చేరిన తర్వాత రాజకీయాల్లో విశేష గుర్తింపు పొందారు; ఆయన మద్దతుదారులు ఆయన్ని సింగం అని పిలుస్తుంటారు. కాగా గత ఎన్నికల్లో తనకు ప్రయారిటీ ఇవ్వలేదు బీజేపీ హైకమాండ్. దీంతో తను తీవ్ర నిరాశకు గురయ్యారు.
ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం కావడంలో కీలక పాత్ర పోషించాడు కె. అన్నామలై పార్టీ చీఫ్ గా. కానీ అనుకోకుండా తనను తప్పించింది. నాగేంద్రనన్ కు పార్టీ పగ్గాలు అప్పగించింది. తను స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. కానీ వర్కవుట్ కాలేదు. అగ్ర నటుడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కొట్టిన దెబ్బకు అన్ని పార్టీలు విల విల లాడాయి. టీవీకే పార్టీ ఊహించని రీతిలో 234 స్థానాలకు గాను 108 సీట్లను కైవసం చేసుకుంది. ఇక బీజేపీ అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసింది. సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. అయితే కె. అన్నామలై కొత్త పార్టీని పెట్టనున్నట్లు టాక్.
