ఐపీఎస్ విశాల్ గున్నీ స‌స్పెన్ష‌న్ పొడిగింపు

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ఏపీ స‌ర్కార్

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది మ‌రోసారి సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ విశాల్ గున్నీకి. త‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. గ‌తంలో ఏపీలో కొలువుతీరిన వైఎస్ జ‌గ‌న్ రెడ్డి పాల‌నా కాలంలో విశాల్ గ‌న్నీకి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చారు. త‌నపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌స్తుత స‌ర్కార్ కొలువు తీరిన వెంట‌నే ఆదేశించింది. దీంతో అప్ప‌ట్లో వైసీపీకి, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మ‌ద్ద‌తు తెలిపిన ప‌లువురు ఉన్న‌తాధికారులు, ఏఏఎస్ లు, ఐపీఎస్ ల‌పై ఫోక‌స్ పెట్టింది. ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ కేసులు న‌మోదు చేసింది. అంతే కాకుండా స‌స్పెన్ష‌న్ విధించింది.

తాజాగా ఏపీ స‌ర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ విశాల్ గున్నీకి. త‌న‌పై విధించిన సస్పెన్షన్ మరోసారి పొడిగించాల‌ని ఆదేశించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. దీంతో సెప్టెంబర్ 4 వరకు విశాల్ గున్ని సస్పెన్షన్ పొడిగించింది. ఇదిలా ఉండ‌గా విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా విశాల్ పై ఆరోపణలు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలను టార్గెట్ చేసి వేధించినట్లు విమ‌ర్శ‌లు ఉన్నాయి. రెండేళ్ల క్రితం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాల్ గున్నిని సస్పెండ్ చేసిన విష‌యం విదిత‌మే.

ఇదిలా ఉండ‌గా త‌న‌ను కావాల‌ని వేధింపుల‌కు గురి చేస్తోందంటూ మ‌రో సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ సునీల్ కుమార్. ఆయ‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు ప్ర‌స్తుత ఏపీ శాస‌న స‌భ ఉప స‌బాప‌తి ర‌ఘురామ కృష్ణ‌మ రాజు. ఇదే విష‌యంపై ఇంకా నోరు విప్ప‌లేదు విశాల్ గున్నీ. తాను కావాల‌ని చ‌ర్య‌లు తీసుకోలేద‌ని , గ‌త ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు తాను న‌డుచుకున్నానని తెలిపాడు ఐపీఎస్ విశాల్ గున్నీ.

Leave A Reply

Your Email Id will not be published!