సైకిల్ కాంగ్రెస్ కొడుకులను తొక్కుతాం : శ్రీ‌నివ‌వాస్ యాద‌వ్

ఏఐసీసీ ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏఐసీసీ ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్ అంబ‌ర్ పేట్ శ్రీనివాస్ యాదవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై. ఆయ‌న గ‌త కొంత కాలంగా నిప్పులు చెరుగుతూ వ‌స్తున్నారు. పార్టీలో ఉంటూ టీడీపీకి వంత పాడుతున్న వారిని టార్గెట్ చేశారు. మొద‌టి నుంచి పార్టీ కోసం క‌ష్ట ప‌డుతున్న వారిని ఇబ్బందుల‌కు గురి చేస్తూ వ‌స్తున్నార‌ని, ఇక నుంచి ఉపేక్షించేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు. అసలు కాంగ్రెస్ నాయకులను తక్కువ చేస్తే సైకిల్ కాంగ్రెస్ కొడుకులను తొక్కుతాం అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా శ్రీ‌నివాస్ యాద‌వ్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నుండి వెళ్ళిపోవడానికి 5 మంది ఎమ్మెల్యేలు, నలుగురు చైర్మన్లు రెడీగా ఉన్నారంటూ బాంబు పేల్చారు. సీఎం రేవంత్ రెడ్డి మీద మండిప‌డ్డారు.

రేవంత్ రెడ్డి నాకే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. తాను వెళ్తే సెక్రటేరియట్ గేట్లు కూడా తెరవడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి శిష్యుడిని చంపేశారు కదా.. అందుకే మనస్పర్థల కారణంగా వెళ్ళిపోయాడని పేర్కొన్నారు శ్రీ‌నివాస్ యాద‌వ్. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు కాంగ్రెస్ పార్టీని అమ్మనా బూతులు తిట్టినా ఏం అనరన్నారు.. అదే బీసీ, మైనారిటీ నాయకులు అయితే నోటీసులు ఇస్తారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి కంటే మహేష్ కుమార్ గౌడ్ గొప్పోడని ప్ర‌శంస‌లు కురిపించాడు. రేవంత్ రెడ్డి తన సొంత ఎంపీ స్థానం మల్కాజ్ గిరితో పాటు స్వంత జిల్లా పాల‌మూరు ఎంపీ సీటును గెలిపించు కోలేక పోయాడ‌ని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు కాబట్టి 10 రోజులు లేటుగా అరెస్ట్ చేశారు.. అదే సామాన్యుడు అయితే వెంటనే అరెస్ట్ చేసే వార‌న్నారు శ్రీ‌నివాస్ యాద‌వ్.

Leave A Reply

Your Email Id will not be published!