ఢిల్లీ కేపిట‌ల్స్ గూటికి రిష‌బ్ పంత్

క్లారిటీ ఇచ్చిన యాజ‌మాన్యం

హైద‌రాబాద్ : క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ స్వంత గూటికి రానున్నాడా. అవున‌నే స‌మాధానం వ‌స్తోంది క్రికెట్ వ‌ర్గాల నుంచి. ఈ ఏడాది ఇండియాలో బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఐపీఎల్ 2026లో త‌ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు త‌రపున ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆ జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. త‌న‌ను ఎవ‌రూ ఊహించ‌లేని విధంగా భారీ ధ‌ర‌కు ఏ భార‌తీయ క్రికెట‌ర్ కు ఇవ్వ‌నంత ధ‌ర‌ను నిర్ణ‌యించి వేలం పాట‌లో తీసుకున్నాడు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ యాజ‌మాని గోయెంకా. కానీ ఐపీఎల్ మెగా టోర్నీలో అటు ఆట‌గాడిగా, కెప్టెన్ గా పూర్తిగా వైఫ‌ల్యం చెందాడు. దీంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది యాజ‌మాన్యం.

త‌న‌ను త‌ప్పించేందుకు రెడీ అయ్యింది. ఇదే స‌మ‌యంలో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా ఆట‌గాడిగా, స్కిప్ప‌ర్ గా ఫెయిల్ అయ్యాడు. త‌ను కూడా సేమ్ రిష‌బ్ పంత్ లాగే తీవ్ర నిరాశ ప‌ర్చాడు. అటిట్యూడ్ కూడా ఆ జ‌ట్టుకు షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రున నిలిచింది. దీంతో పాండ్యాను చేజిక్కించుకునేందుకు ముంబై ఇండియ‌న్స్ తో ల‌క్నో మేనేజెమ్ంట్ చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు టాక్. అయితే హార్దిక్ మాత్రం చెన్నై సూప‌ర్ కింగ్స్ వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు టాక్. ఇదే క్ర‌మంలో తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. అదేమిటంటే రిష‌బ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిట‌ల్స్ గూటికి చేరుకోబోతున్న‌ట్లు తెలిసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా పంచుకుంది సంగీత జిందాల్.

Leave A Reply

Your Email Id will not be published!