ముంబై : శివసేన ఎంబీటీ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో కేవలం బీజేపీ మాత్రమే ఉండాలని అనుకుంటోందని ఆరోపించారు. గురువారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన ఎంపీలను ప్రలోభాలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి డబ్బులు చేతులు మారిన విషయాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. నిన్నటి దాకా పశ్చిమ బెంగాల్ అయి పోయిందని, ఇప్పుడు మరాఠాలో కూడా తమకు ఎదురే లేకుండా చేయాలని ఇక్కడి కూటమిలోని పార్టీలు ప్రయత్నం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు సంజయ్ రౌత్.
మహారాష్ట్ర: ‘ఆపరేషన్ టైగర్’ గురించి శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. నేను ఎప్పుడూ తప్పుడు గణాంకాలను చెప్పలేదన్నారు. రాత్రిపూట రూ. 15 కోట్లు ఇచ్చారని నేను చెప్పాను. ఆ తర్వాత, వారందరినీ జైపూర్‌కు తరలించి, మళ్లీ రూ. 10 కోట్లు ఇచ్చారు… ఎంపీలకు ఇంకా ఎక్కువ ఇచ్చారని తెలిసిందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు కూడా ఆమోదం లభించాల్సి ఉంది, అందుకే ఆ ధర పెరిగిందన్నారు. నేను ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నాను… ప్రతి ఒక్కరూ డబ్బు కోసం తమను తాము వేలం వేసుకున్నారంటూ వ్యాఖ్యానించారు.
ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యమని ఎంపీ ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. దేశంలో గత 12 ఏళ్ల కిందట పవర్ లోకి వచ్చిన బీజేపీ మోదీ, షా సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ వచ్చిందన్నారు సంజయ్ రౌత్. ఏదో ఒక రోజు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
