రైతు ఉత్పత్తి సంఘాలకు నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ కృషి
కీలక ప్రకటన చేసిన జాతీయ స్వచ్చంధ సేవా సంస్థ
న్యూఢిల్లీ : నేషనల్ ఆగ్రో-వాల్‌మార్ట్ ఫౌండేషన్ శుక్రవారం సంచలన ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. మార్కెట్‌కు సిద్ధంగా ఉన్న సంస్థలుగా మార్చడం, నీటి భద్రతను కల్పించడం, 12,500 రైతు కుటుంబాలను ముఖ్యంగా మహిళలను భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలోని కీలక వ్యవసాయ ప్రాంతాలైన రాయలసీమ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లలోని 12,500 మందికి పైగా చిన్నకారు రైతులకు మద్దతు ఇచ్చేందుకు నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ వాల్‌మార్ట్ ఫౌండేషన్ నుండి ఆర్థిక సహాయాన్ని (గ్రాంట్) పొందింది. ఈ కార్యక్రమం 10 రైతు ఉత్పత్తిదారుల సంఘాలతోకలిసి పనిచేస్తూ, రైతులకు మార్కెట్ అవకాశాలను మెరుగు పరచడం, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, మెరుగైన జీవనోపాధి అవకాశాలను కల్పించడం వంటివి చేపడుతుంది.
ఇందులో మహిళా రైతులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. రాయలసీమ , కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని ఎంపిక చేసిన 10 రైతు ఉత్పత్తి సంఘాలకు చెందిన 12,500 మంది రైతులకు సుస్థిర ఆర్థికాభివృద్ధి , వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం కోసం సాధికారత కల్పించడం” అనే శీర్షికతో కూడిన ఈ ప్రాజెక్ట్, మరింత సుస్థిరమైన, సమాజం నేతృత్వంలోని సంస్థలుగా ఎదిగేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నం ద్వారా, ఇందులో పాల్గొనే రైతులు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి, వాతావరణ సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి , దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని సాధించడానికి మెరుగ్గా సన్నద్ధమవుతారు.
ఈ కార్యక్రమం గురించి నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ముఖ్య కార్య నిర్వహణాధికారి డాక్టర్ ఎం.ఆర్. రామ సుబ్రమణియన్ మాట్లాడుతూ వాల్‌మార్ట్ ఫౌండేషన్ అందించిన ఉదారమైన మద్దతుతో ఇది ఒక చారిత్రాత్మక కార్యక్రమం. సుస్థిర వ్యవసాయ ఉత్పత్తి , విలువ గొలుసు, బాధ్యతాయుతమైన ఉత్పత్తి, మెరుగైన మార్కెట్ సౌకర్యం, సామూహిక చర్యల ద్వారా ధరలను సాధించడం వంటి సమిష్టి కృషితో 12,500 మందికి పైగా చిన్న రైతులకు ఆదాయాన్ని పెంచి ప్రయోజనం చేకూర్చడమే దీని లక్ష్యం. అలాగే, అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమానికి మహిళలను కేంద్రంగా ఉంచడం కూడా దీని ఉద్దేశ్యం అని ప్రకటించారు.
