అమెరికా : అమెరికా భారత్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఓవైపు మోదీ స్నేహితుడని అంటూనే ఇంకో వైపు టారిఫ్ లు విధించేందుకు సిద్దమైంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌పై 100 శాతం సుంకాలు విధించే బిల్లును అమెరికా ప్రవేశ పెట్టింది . భారత్, చైనాలతో పాటు స్లోవేకియా, హంగేరీ, అజర్‌బైజాన్ దేశాలు కూడా ఈ సుంకాల ప్రభావానికి గురవుతాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలతో సహా ఐదు దేశాలపై 100 శాతం సుంకాలు విధించాలని కోరుతూ అమెరికా సెనేటర్ల బృందం ఒక బిల్లును ప్రవేశపెట్టింది. దివంగత రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం చొరవతో రూపొందించిన ఈ బిల్లు, రష్యా నుంచి గ్యాస్ కొనుగోలు చేసే 15 ఐరోపా దేశాలకు సుంకాల నుంచి మినహాయింపు నిస్తుంది; ఆ దేశాల మొత్తం అవసరాలతో పోలిస్తే ఈ కొనుగోళ్లు చాలా తక్కువని, అలాగే మాస్కోపై ఆధార పడటాన్ని తగ్గించుకునేందుకు ఆ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయని దీనికి కారణంగా పేర్కొన్నారు.
భారత్, చైనాలతో పాటు స్లోవేకియా, హంగేరీ, అజర్‌బైజాన్ దేశాలు కూడా ఈ సుంకాల ప్రభావానికి గురవుతాయి. దీనిని సుంకాల బిల్లు అని పిలుస్తున్నప్పటికీ, వాస్తవానికి ఇది రష్యా ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలపై అంటే ఇంధన పరిశ్రమ, ఆర్థిక రంగం, రక్షణ పారిశ్రామిక వ్యవస్థ, అలాగే ఒలిగార్క్‌లు వ్యాపారవేత్తలు , స్వయంగా వ్లాదిమిర్ పుతిన్‌పై పూర్తి స్థాయి ఆంక్షలను విధిస్తుంది అని కనెక్టికట్‌కు చెందిన డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతల్ విలేకరులతో అన్నారు. ఇది నిర్దిష్టమైన సుంకాలను విధిస్తుంది: అంటే కేవలం ఐదు ప్రధాన కొనుగోలుదారులపై మాత్రమే (100 శాతం వరకు) పరిమితం చేయబడింది; అలాగే మినహాయింపు అధికారం కూడా చాలా పరిమితంగా, కఠిన నిబంధనలతో కూడి ఉంటుంది. ప్రస్తుతం చమురు కొనుగోలు చేస్తున్న ఆ ఐదు ప్రధాన దేశాలు చైనా, భారత్, స్లోవేకియా, హంగేరీ , అజర్‌బైజాన్ అని బ్లూమెంతల్ పేర్కొన్నారు.
