కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నిర‌స‌నకారుల‌పై దాడులు త‌గ‌దు

ఖండించిన ఆమ్ ఆద్మీ పార్టీ, ప్ర‌తిప‌క్షాలు

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ఆందోళ‌న తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. నిరసనకారులపై పోలీసుల చర్యను ఆప్, ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. పేపర్ లీక్‌ల అంశంపై గళమెత్తే వారిని అణచి వేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆప్ నేత మనీష్ సిసోడియా ఆరోపించారు. 21 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను జంతర్ మంతర్ నుండి ఆసుపత్రికి తరలిస్తుండగా భద్రతా సిబ్బంది కాపలాగా ఉన్నారు. సోనంను మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ , సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. శాంతియుత నిరసనను అణచివేస్తున్నారని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.

పేపర్ లీక్‌లకు మోదీ చూపిన పరిష్కారం ఇదేనా అని ప్ర‌శ్నించారు ఆప్ నేత‌లు. పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా గళమెత్తే వారిని గూండాలతో కొట్టించడం, వారిని అస్సలు గళమెత్తనివ్వ కపోవడం. ఇది రాజకీయం కాదు, పిరికితనం. ఎంతటి దుర్మార్గపు పాలన ఇది అని సిసోడియా ఆరోపించారు. సుదీర్ఘ దీక్షలో ఉన్న వాంగ్‌చుక్‌ను బలవంతంగా తరలించారని పేర్కొన్నారు. ఇది ఎలాంటి దుర్మార్గం? మోదీ ఈ అధికార అహంకారం ఎక్కువ కాలం నిలవదు. మీరు లాఠీలతో కొడుతున్న ఆ యువతే మీ సింహాసనాన్ని కూల్చివేస్తుంది. గత 21 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న వ్యక్తి. ఆయన డిమాండ్లను వినడానికి బదులుగా, బలవంతంగా అరెస్టు చేసి ఆసుపత్రిలో చేర్చారు అని సంజయ్ సింగ్ ఆరోపించారు.

Leave A Reply

Your Email Id will not be published!