చెన్నై : తమిళ చలనచిత్ర పరిశ్రమకు చెందిన నటుడు , దర్శకుడు సీఎం విజయ్ కొడుకు జేసన్ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం తన తండ్రి విజయ్‌ను తీసుకెళ్లాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన కామెంట్స్ ఇప్పుడు సినీ రంగంలో హాట్ టాపిక్ గా మారాయి. నటుడు , రాజకీయ నాయకుడు అయిన విజయ్ కుమారుడు జేసన్ సంజయ్, తాను రూపొందిస్తున్న ‘సిగ్మా’ సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. తెలుగు నటుడు సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి జేసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒకవేళ అంతర్జాతీయ స్థాయి నటుడితో కలిసి పనిచేసే అవకాశం వస్తే, తన తండ్రిని కూడా హాలీవుడ్‌కు తీసుకెళ్తారా అని జేసన్‌ను అడిగినప్పుడు ఆయన ఆసక్తికరంగా స్పందించారు.
ఒకవేళ హాలీవుడ్ స్టార్ జేసన్ స్టాథమ్ ‘సిగ్మా’ సినిమాను చూసి, అది నచ్చి, జేసన్ సంజయ్‌తో కలిసి పని చేయాలని కోరుకుంటే అప్పుడు సహన టుడిగా ఎవరిని ఎంచుకుంటారని అడిగిన ప్రశ్నకు ఆయన ఏమాత్రం సంకోచించకుండా కీలక జవాబు ఇచ్చే ప్రయత్నం చేశాడు. సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకుని, కోట్లాది అభిమానులను కలిగిన ఏకైక నటుడు, నా తండ్రి సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తప్ప మరొకరిని తాను సహ నటుడిగా ఎవరినీ అంగీకరించే ప్రసక్తి లేదని పేర్కొన్నాడు జేసన్ సంజయ్ . మా నాన్న (విజయ్)నే ఎంచుకుంటాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మా ఇద్దరి కలయికలో అది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అవుతుంది అని ధీమా వ్యక్తం చేశారు దర్శకుడు. వాస్తవానికి జేసన్ సంజయ్ రూపొందించిన ‘సిగ్మా’ చిత్రం థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన కొత్త విడుదల తేదీని ఖరారు చేయనున్నారు.
