గ్లాస్గో : కామన్వెల్త్ గేమ్స్‌లో డెకాథ్లాన్ పతకం గెలిచిన తొలి భారతీయుడిగా తేజస్విన్ శంకర్ రికార్డు సృష్టించాడు. గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల డెకాథ్లాన్ విభాగంలో భారత్‌కు చెందిన తేజస్విన్ శంకర్ మొత్తం 7,976 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. తద్వారా ఈ ఈవెంట్లో కామన్వెల్త్ గేమ్స్ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు. జాతీయ రికార్డు హోల్డర్ అయిన తేజస్విన్ శంకర్ దీర్ఘకాలిక మోకాలి గాయాన్ని అధిగమించి పతకాన్ని సాధించడం విశేషం. రెండు రోజుల పాటు జరిగిన కఠినమైన 10-ఈవెంట్ల పోటీలో తేజస్విన్ పాయింట్లను సాధించాడు. దీర్ఘకాలిక ‘పటెల్లార్ టెండినిటిన్స్ సమస్య ఉన్నప్పటికీ ఆయన పోటీలో పాల్గొన్నాడు.
ఈ సమస్య కారణంగానే అంతకు ముందు గ్లాస్గో గేమ్స్‌లోని పురుషుల హైజంప్ ఈవెంట్ నుండి తను తప్పుకోవాల్సి వచ్చింది. హైజంప్ ఈవెంట్లో తన మొదటి ప్రయత్నం తర్వాత పాత గాయం తిరగ బెట్టడంతో, పోటీ నుండి తప్పుకోవాల్సి వచ్చినప్పుడు తేజస్విన్ తీవ్ర నిరాశతో కన్నీటి పర్యంతమయ్యారు. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో హైజంప్‌లో కాంస్యం గెలిచిన తర్వాత, ఇది ఆయనకు రెండవ కామన్వెల్త్ గేమ్స్ పతకం. తన పేరిట ఉన్న జాతీయ రికార్డు 8057 పాయింట్లుగా ఉంది. ఇది ప్రతికూల పరిస్థితా కాదా అనేది నాకు తెలియదు. కానీ నాలోని పోటీతత్వం సజీవంగా ఉందని నాకు తెలుసు అని పేర్కొన్నాడు ఈ సందర్భంగా కాంస్య పతకం గెలిచిన తర్వాత.
ఈ పరిస్థితులు, వాతావరణంలో నాకు ఆ ఉత్సాహం, పోటీతత్వం లభించాయని మెడల్ తీసుకున్న అనంతరం పేర్కొన్నారు. ఏదైనా సాధించాలని ప్రయత్నిస్తూ, అదే సమయంలో ఫలితంపై ఖచ్చితమైన హామీ లేని స్థితిలో ఉండటం నాకు చాలా ఉత్సాహాన్నిస్తుంది. నాకు సవాలుతో కూడిన ఉత్కంఠభ రితమైన పరిస్థితులంటే ఇష్టం అన్నాడు.
