ఆదివాసీ హ‌క్కుల కార్య‌క‌ర్త ప్ర‌ణ‌బ్ డోలీపై ఎన్ఎస్ఏ

ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కాంగ్రె్స్ పార్టీ

అస్సాం : కజిరంగాలో గిరిజన భూములను రిసార్ట్ గ్రూపులు బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిరసించినందుకు ఆదివాసీ హక్కుల కార్యకర్త ప్రణబ్ డోలీపై అస్సాం ప్రభుత్వం ఎన్ఎస్ఏ ప్రయోగించింది. జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధించడంపై కాంగ్రెస్ ఆదివారం అస్సాం ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. అసమ్మతిని అణచి వేయడానికి బీజేపీ ప్రభుత్వాలు అసాధారణ చట్టాలను ఆయుధాలుగా వాడుకోవడంలో భాగంగానే ఆయనపై ఎన్ఎస్ఏను ఉపయోగించారని ఆరోపించింది. ఇది నివారణ నిర్బంధ చట్టాల స్పష్టమైన దుర్వినియోగం , ప్రభుత్వ “అతిక్రమణ” అని కూడా ప్రతిపక్ష పార్టీ పేర్కొంది.

కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ మాట్లాడుతూ జిల్లా కోర్టు డోలీకి బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే, జూలై 30న అస్సాం ప్రభుత్వం భూ హక్కుల కార్యకర్త డోలీపై జాతీయ భద్రతా చట్టం)ను ప్రయోగించిందని అన్నారు. ఇది నివారణ నిర్బంధ చట్టాల దుర్వినియోగం , ప్రభుత్వ అతిక్రమణ” అని రమేష్ అన్నారు. అస్సాం ముఖ్యమంత్రి మద్దతు ఇచ్చిన కజిరంగ జాతీయ పార్క్ సమీపంలో ప్రతిపాదిత ఫైవ్-స్టార్ రిసార్ట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన గ్రామస్థులకు మద్దతు ఇచ్చినందుకు డోలీని అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. 2022 నుండి, గోలాఘాట్‌లోని ఆదిమవాసులు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ, గౌహతి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారని, తమ నుండి భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని వాదించారని రమేష్ తెలిపారు.

జూలై 29న అతనికి బెయిల్ మంజూరు చేస్తూ పర్యావరణ పరిరక్షణ, ఆదివాసీల మనుగడ ముడిపడి ఉన్న చోట, చట్టబద్ధమైన స్థానిక ఆందోళనలను అణచి వేయడానికి క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించలేము అని సెషన్స్ కోర్టు వ్యాఖ్యానించిందని రమేష్ అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!