రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ జీవితం ఎంతో ఆదర్శ ప్రాయమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కొనియాడారు. గుంటూరు లో గురువారం ఘనంగా జరిగిన ‘కన్నా’ రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు, ఆయన 73వ జన్మదిన మహోత్సవ వేడుకలకు అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకసారి ఎన్నికల్లో గెలిస్తే రెండోసారి గెలవడం కష్టంగా మారిన ప్రస్తుత రోజుల్లో కన్నా లక్ష్మీనారాయణ ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఏకైక నేతగా ఘనత సాధించారని కితాబిచ్చారు.
క్రమశిక్షణ, పట్టుదల, పోరాట పటిమ కన్నా లక్ష్మీనారాయణ నైజమని , ఆయన నడిచిన బాట నుంచి నేటి తరం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు స్పీకర్. నాడు దివంగత ఎన్టీఆర్ తనకు టికెట్ ఇవ్వడం వల్లే నేడు ప్రజల ఎదుట ఇలా నిలబడే అవకాశం కలిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచు కోవాల్సిన అవసరం ఉందని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. నేటి యువత చురుగ్గా రాజకీయాల్లోకి వచ్చి స్వచ్ఛమైన పాలన అందించాలని పిలుపునిచ్చారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా కన్నా లక్ష్మీనారాయణ గొప్ప నటుడిగా, బాడీ బిల్డర్గా, ఎన్.సి.సి కేడెట్గా బహుముఖ ప్రజ్ఞను కనబరిచారని ప్రశంసించారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఇలాంటి పెద్దాయన గురించి మాట్లాడే అవకాశం రావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. కన్నా లక్ష్మీనారాయణకు దేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు.
Breaking
- పల్లెల అభివృద్దికి రహదారుల బలోపేతం కీలకం
- 82 పైసలు పెరిగిన భారతీయ రూపాయి
- ఆరవ వారం నామినేషన్లలో ఘాటైన గొడవలు
- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకు విజయ్ కంగ్రాట్స్
- అల్లు అర్జున్ తో లోకేష్ కనగరాజ్ మూవీ కన్ ఫర్మ్
- రూ.3,222 కోట్లతో దివ్యక్షేత్రంగా తిరుపతి అభివృద్ధి
- విజయవాడలో జాతీయ స్థాయి ‘సరస్ మేళా’
- టీఎస్ఆర్టీసీ బస్సుల్లో కొనసాగుతున్న రద్దీ
- మున్సిపాలిటీలు, నగర పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు
- పీ4లో బీసీ యువతకు ఉచిత సివిల్స్ కోచింగ్