విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక ‘ర‌ణ‌బ‌లి’ పోస్ట‌ర్ రిలీజ్

సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతోంది

హైద‌రాబాద్ : ర‌ణ‌బ‌లి మూవీ టీం శ‌నివారం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పోస్టర్ ను విడుద‌ల చేసింది. ఈ ఇద్ద‌రు క‌లిసి చాన్నాళ్ల త‌ర్వాత న‌టిస్తున్నారు. ఈ మ‌ధ్యే వీరు ఒక్క‌ట‌య్యారు. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ర‌ణ‌బ‌లి మూవీ ఒకటి. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి అభిమానులలో ఈ సినిమాపై భారీ అంచనాలను చిత్ర బృందం కొనసాగిస్తూనే ఉంది. స్వాతంత్ర‌ దినోత్సవం సందర్భంగా వారు ఈ సినిమా కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు. పోస్టర్‌ను పంచుకుంటూ మన విస్మరించబడిన చరిత్రలోని అత్యంత ధైర్యసాహసాలతో కూడిన అధ్యాయం త్వరలో ఆవిష్కృతం కానుంది అని వారు పేర్కొన్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై. రవి శంకర్ , నవీన్ యెర్నేని దీనిని నిర్మిస్తున్నారు టి-సిరీస్ సహకారంతో.

ఇదిలా ఉండ‌గా ఈ ప్రాజెక్ట్‌లో అంతర్జాతీయ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక ర‌ణ‌బ‌లి మూవీ విష‌యానికి వ‌స్తే ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇది ప‌క్కా తెలుగు పీరియడ్ డ్రామాగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు రాహుల్ సాంకృత్య‌న్. పాత్ర‌ల ప‌రంగా చూస్తే ర‌ణ‌బ‌లిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, జ‌య‌మ్మ‌గా ర‌ష్మిక మంద‌న్నా, స‌ర్ థియోడ‌ర్ హెక్ట‌ర్ గా అర్నాల్డ్ , వినోద్ సాగ‌ర్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌ణ‌బ‌లి చిత్రానికి ప్ర‌మోద్ త‌మ్మినేని స‌మ‌కూర్చారు. అజ‌య్ అతుల్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!