అమరావతి : శాఖలు, అంశాలపై గంటల తరబడి రివ్యూలు చేయడం కాదు రిజల్ట్స్ కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను, అధికారులను నిర్దేశించారు. రాష్ట్ర సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైంది. వివిధ అంశాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. గత సమావేశంలో నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టులు ఇక నుంచి తప్పనిసరి కావాలన్నారు. ఓనర్షిప్ తీసుకోగలిగితేనే లీడర్షిప్ ఇవ్వగలరని పేర్కొన్నారు. 27 నెలల్లో అనేక వ్యవస్థాగత మార్పులు చేశాం అన్నారు. దీంతో ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు . 28 కొత్త పాలసీలతో అవకాశాలను అన్ లాక్ చేశాం. రియాక్టివ్ గవర్నెన్స్ నుంచి ప్రో యాక్టీవ్ గవర్నెన్స్‌కు వెళ్లాలన్నారు. ఫైల్ పెండింగ్ అంటే అభివృద్ధి పెండింగే. ఫిర్యాదు పెండింగ్ అంటే ప్రజలకు న్యాయం పెండింగ్. విజన్ ఉన్నా దాన్ని అమలు చేయకుంటే అవి నెరవేరని ఆశలుగానే మిగిలి పోతాయని అన్నారు. ఇప్పుడు కాలం మారింది. ఫేక్ ప్రచారాలకు కౌంటర్ కూడా ఇవ్వాలని స్పష్టం చేశారు సీఎం.
సమస్యను దాచిపెడితే పెద్దది అవుతుంది. ఓపెన్‌గా చర్చిస్తే పరిష్కారం లభిస్తుంది. సాధారణ పరిపాలన కాదు. ప్రజలు మెచ్చే సుపరిపాలన కావాలి. శాఖలు పోటీ పడాలి. జిల్లాలు పోటీ పడాలి. సెక్రటరీలు పోటీ పడాలి, కలెక్టర్లు పోటీ పడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుందాం..బెస్ట్ పాలసీలు అమలు చేద్దాం. వన్ స్టేట్-వన్ విజన్-వన్ టీమ్-వన్ మిషన్. అదే స్వర్ణాంధ్ర అని ముఖ్యమంత్రి అన్నారు.కొన్ని చోట్ల లీడర్షిప్ లోపం ఉంది. ఉద్యోగుల సామర్ధ్యం పెంపు కోసం వివిధ కోర్సులు కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకూ 1.50 కోట్ల కోర్సులను సామర్ధ్యాలను పెంచేందుకు నిర్వహించాం. డీప్ టెక్ గవర్నెన్స్ ఉంటే అనూహ్యమైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంది. టెక్నాలజీని వినియోగించడం ద్వారా డేటా లేక్, అవేర్ లాంటి వ్యవస్థలతో నిర్ణయాల్లో వేగం పెరగాలి. సేవల్లో నాణ్యత పెంచాలి. గతంలో 50 ఏళ్లలో చేసే అభివృద్ధిని ఇప్పుడు 10-15 ఏళ్లలోనే సాధించేందుకు ఆస్కారం ఉంది. మనకు వనరులు ఉన్నాయి. టెక్నాలజీ అందుబాటులో ఉంది. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా 27 నెలల్లో రాష్ట్ర ఆర్ధికవ్యవస్థను గాడిన పెట్టాం అన్నారు.
