సీఎం చంద్ర‌బాబు సీఈవో టు వాటర్ మ్యాన్

ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించిన ప‌య్యావుల కేశ‌వ్

అమ‌రావ‌తి : ఎకనమిక్ టైమ్స్ లో వచ్చిన వాటర్ మ్యాన్ ఆర్టికల్ గురించి కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. సాగునీటి రంగంలో సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని అభినందిస్తూ కలెక్టర్ల కాన్ఫరెన్సులో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. నీటి వనరుల రంగంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం సాధించిన విజయాలను దేశం గుర్తించింది అని అన్నారు. వెలిగొండ, పోలవరం ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల గురించి వివిధ రాష్ట్రాల్లో చర్చ జరుగుతోందని చెప్పారు. ఈ నిశ్శబ్ద పురోగతి వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారు. మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్సులోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. అందుకే హంద్రీనీవా, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ ద్వారా నీళ్లు ఇవ్వగలిగాం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ టెక్నాలజీని తీసుకువచ్చి రాష్ట్రంలో అమలు చేశాం అని తెలిపారు.

గతంలో రూ.16 మీటరు డ్రిప్ పైప్ ఖరీదు. ఇప్పుడు 30 ఏళ్ల ద్రవ్యోల్బణం తర్వాత రూ.1.60 పైసలకే దొరుకుతోంది. రాయలసీమ జిల్లాల్లో డ్రిప్ ద్వారా చేసిన సాగు, సృష్టించిన సంపదే దీనికి ఉదాహరణగా నిలుస్తోంద‌న్నారు మంత్రి ప‌య్యావుల కేశ‌వ్. పట్టిసీమ ప్రాజెక్టును కొందరు వ్యతిరేకించారు. కానీ ఆదే ప్రాజెక్టు నుంచి ఇప్పటి వరకూ 500 టీఎంసీల నీటిని తరలించగలిగాం. ప్రకాశం బ్యారేజీని 200 సార్లు ఇప్పటి వరకూ నింపగలిగాం. డెల్టా ప్రాంతానికి నీరు ఇచ్చాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టించిన నిశ్శబ్ద నీటి ప్రయాణాన్ని రాష్ట్ర ప్రజలు, దేశం కూడా గుర్తించిందని ఇది రాష్ట్ర ప్ర‌జ‌లకు గ‌ర్వ కార‌ణంగా నిలిచంద‌న్నారు. రైతుల గురించి సీఎం పడుతున్న నిరంతర తపనను ఎకనమిక్ టైమ్స్ పత్రిక వాటర్ మాన్ గా ఆయన్ను కీర్తిస్తూ కథనం రాసిందని చెప్పారు. ఇది సీఎం సాధించిన విజయం.. ముఖ్యమంత్రి విజయంలో ఏపీ అభివృద్ధి ఉంది అని మంత్రి అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!