హైదరాబాద్ : పని ఒత్తిడి పెరిగిందని, బ్యాంకు లావాదేవీల నిర్వహణకు సంబంధించి కేవలం 5 రోజులు మాత్రమే ఉండాలని , తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. సిబ్బంది సమ్మె కారణంగా తెలంగాణ బ్యాంకులకు 4 రోజుల అంతరాయం ఏర్పడింది. దీంతో రోజూ వారీ కార్యకలాపాలకు, లావాదేవీలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లబోదిమంటున్నారు వినియోగదారులు. మరో వైపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం సానుకూల స్పందన లేదా ఒక నిర్దిష్ట కాలపరిమితి ఇస్తే సమ్మెను పునః పరిశీలిస్తామని యూనియన్లు ప్రకటించాయి. అయినా కేంద్రం నుంచి స్పందన రాలేదు. సెప్టెంబర్ 8, 9 తేదీలలో జరిగిన రాజీ చర్చల సందర్భంగా అలాంటి హామీ ఏదీ రాలేదు. యూనియన్ల ప్రధాన డిమాండ్ అయిన ఐదు రోజుల బ్యాంకింగ్ కోసం ఒక నిర్దిష్ట కాలపరిమితిని ఇవ్వడంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఆర్థిక సేవల విభాగం, కార్మిక అధికారులతో జరిపిన చర్చలు విఫలమవడంతో సమ్మె కొనసాగుతోంది.
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలోని ఉద్యోగులు నిన్న ఆందోళన బాట పట్టారు. ఆ తర్వాత రెండవ శనివారం, ఆదివారం , సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి రోజున దేశవ్యాప్త సమ్మెకు దిగడంతో తెలంగాణలోని బ్యాంకు వినియోగదారులు శుక్రవారం నుండి నాలుగు రోజుల పాటు సాధారణ బ్రాంచ్ సేవలు లేకుండానే గడిచి పోతున్నాయి. టెల్లర్ లావాదేవీలు, చెక్కుల పని , రుణాల ప్రాసెసింగ్‌కు అంతరాయం కలుగుతోంది.,అయితే యూపీఐ, మొబైల్ , ఇంటర్నెట్ బ్యాంకింగ్ , ఏటీఎంలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. యూనియన్ల ప్రధాన డిమాండ్ అయిన ఐదు రోజుల బ్యాంకింగ్ కోసం కచ్చితమైన కాలపరిమితిని రూపొందించడంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఆర్థిక సేవల విభాగం , కార్మిక అధికారులతో చర్చలు విఫలమవడంతో సమ్మె చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం సానుకూల స్పందన లేదా ఒక నిర్దిష్ట కాలపరిమితి ఇస్తే సమ్మెను పునఃప రిశీలిస్తామని యూనియన్లు అధికారులకు తెలిపాయి.
