కోల్ కతా : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం సంస్కరణలను ప్రోత్సహిస్తోందని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్ర బొగ్గు రంగంలో జవాబుదారీతనం కొరవడిందని రెడ్డి విమర్శించారు . పశ్చిమ బెంగాల్ బొగ్గు రంగం ఏళ్లుగా అక్రమ మైనింగ్ ఆపరేటర్లు, మాఫియాల పట్టులో ఉందని పేర్కొన్నారు. పారదర్శకత తీసుకు రావడానికి, అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి, మైనింగ్ ఆదాయాలు రాష్ట్ర ఖజానాకు చేరేలా చూడటానికి కేంద్రం సంస్కరణలు చేపడుతోందని ఆయన స్పష్టం చేశారు. కోల్‌కతాలోని అసోచామ్ ఆధ్వర్యంలో అంగుల్ అల్యూమినియం పార్క్‌లో నిర్వహించిన పారిశ్రామిక రోడ్‌షోలో ప్రసంగించారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్ట్ర బొగ్గు రంగంలో జవాబుదారీతనం కొరవడిందని రెడ్డి విమర్శించారు .పరిస్థితిని “అరాచక పాలన”గా అభివర్ణించారు.
పశ్చిమ బెంగాల్లో చాలా సంవత్సరాలుగా బొగ్గు రంగం మాఫియా , అక్రమ మైనింగ్ ఆపరేటర్ల నియంత్రణలో ఉందన్నారు. కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉన్నప్పటికీ, ఈ వాస్తవంతో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అనుభవం ఉందన్నారు. రాష్ట్రంలో బొగ్గు, మైనింగ్ రంగ అభివృద్ధిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశమవుతానని ఆయన తెలిపారు. అనధికార మైనింగ్ వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరిస్తూ, సరైన అనుమతులు, భద్రతా ప్రమాణాలు లేదా నియంత్రణ పర్యవేక్షణ లేకుండా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు. మైనింగ్‌కు అనుమతి లేకపోయినా, విద్యుత్ కనెక్షన్లను ఉపయోగించి అక్రమ తవ్వకాలు జరిగాయని ఆరోపించారు కిషన్ రెడ్డి.
జవాబుదారీతనం సున్నా. పశ్చిమ బెంగాల్లో అలాంటి ‘జంగల్ రాజ్’ ప్రబలిందని మండిపడ్డారు. దానిని ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మార్చడానికి తాము అంకితభావంతో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడానికి సహాయ పడుతోందని రెడ్డి అన్నారు. గతంలో బొగ్గు నుండి వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖాతాల్లోకి చేరేది కాదన్నారు. అది ఇతర మార్గాలకు వెళ్ళిపోయేదని ఆరోపించారు.
